Tuck Jagadish: షూటింగ్ పూర్తిచేసుకున్న ‘టక్ జగదీష్’.. డబ్బింగ్ మొదలు పెట్టిన స్టార్ హీరో నాని..
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీషఅ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం టక్ జగదీష్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీషఅ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో టక్ జగదీష్ 26వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రీతవర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.
దర్శకుడు శివ నిర్వాణ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న టక్ జగదీష్ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. తాజాగా ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. అనంతరం నాని శ్యామ్ సింగ రాయ్ మూవీ షూటింగ్లో పాల్గొననున్నట్లుగా టాక్. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ ఎస్. బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. యువ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నానికి జోడిగా సాయిపల్లివి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Also Read:
TuckJagadish: ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన నాని… ఈసారి ఫుల్ మీల్సే అంటూ ట్విట్టర్ పోస్ట్…