Hitler 24 Years: ‘హిట్లర్’ వచ్చి నేటితో 24 ఏండ్లు.. 100 డేస్ ఫంక్షన్ గురించి ఒక విషయం చెబుతున్న ‘లూసిఫర్’ డైరెక్టర్
Hitler 24 Years: చిరంజీవి విజయవంతమైన చిత్రాలలో హిట్లర్ సినిమా ఒకటి. 1997లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సిస్టర్స్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా
Hitler 24 Years: చిరంజీవి విజయవంతమైన చిత్రాలలో హిట్లర్ సినిమా ఒకటి. 1997లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సిస్టర్స్ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా చిరంజీవికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. నేటితో ఈ సినిమా రిలీజై 24 సంవత్సరాలు గడుస్తోంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఎడిటర్ మోహన్ సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు మోహన్ కుమారుడు మోహన్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ హిట్లర్100 డేస్ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మోహన్ రాజా.
ఈ సందర్భంగా హిట్లర్ వంద రోజులప్పుడు తండ్రి కొడుకలు ఇద్దరు కలిసి చిరంజీవిని సన్మానిస్తున్న ఫొటో షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటో వైరల్‌గా మారుతోంది. అయితే అప్పుడు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన రాజా ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న 153 వ సినిమా లూసిఫర్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను త్వరలో అందిస్తామని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మలయాళంలో హిట్‌గా నిలిచిన లూసిఫర్‌ను మోహన్ రాజా తెలుగులో తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
మరిన్ని వార్తలు:
Pawan kalyan-Harish Shankar Movie : ఈ సారి పవన్ కళ్యాణ్ ను హరీష్ శంకర్ అలా చూపించబోతున్నాడట..!
Farmers Protest Live Updates: రైతులు, కేంద్రం మధ్య ఏడో విడత చర్చలు.. సఫలం అయ్యేనా.?