AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి పనులు తక్కువ టైంలో అయిపోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

రోజువారీ జీవితంలో శ్రమ తగ్గించుకునే చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వంటగది, గోడలు, టీవీ వంటి చోట్ల శుభ్రత కొనసాగించేందుకు కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. వెనిగర్, బేకింగ్ సోడా వంటి పదార్థాలతో తక్కువ సమయంలో శుభ్రంగా ఉంచవచ్చు. ఇప్పుడు అలాంటి చిట్కాల్ని తెలుసుకుందాం.

ఇంటి పనులు తక్కువ టైంలో అయిపోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!
Home Cleaning Hacks
Prashanthi V
|

Updated on: Apr 17, 2025 | 10:41 PM

Share

రోజువారీ జీవితంలో చిన్నచిన్న చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. వంటగదిలో పనులు తక్కువగా చేయాలంటే కొన్ని సులభమైన మార్గాలు తెలుసుకుంటే చాలు. ఇవి మన శ్రమను తగ్గిస్తాయి. సమయం ఆదా అవుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంచడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే పని తేలికగా అవుతుంది. ఇప్పుడు అలాంటి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

మురికిగా ఉండే డోర్‌మ్యాట్‌కి పరిష్కారం.. ఇంట్లో ఎక్కువ మురికిగా ఉండేది డోర్‌మ్యాట్. మనం రోజంతా వాడుతూ ఉండి కూడా వాటిని తరచూ కడగం. అందుకే వాటిపై చాలా ధూళి పేరుకుంటుంది. చేతులతో కడగడం కష్టంగా ఉంటుంది. దీన్ని తక్కువ శ్రమతో శుభ్రం చేయొచ్చు.

వాషింగ్ మెషీన్ లేకుండా డోర్‌మ్యాట్ శుభ్రం చేయడం.. ఒక బకెట్‌లో గోరువెచ్చని నీళ్లు పోసి అందులో ఒక చెంచా బేకింగ్ సోడా వేసి తర్వాత కొంచెం వెనిగర్ కలపాలి. డోర్‌మ్యాట్‌ను అందులో 5 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేస్తే దానిలో ఉండే మురికి 75 శాతం వరకు తొలగిపోతుంది.

ఇతర బకెట్‌లో కొద్దిగా గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల సరుపు పొడి కలిపి.. అదే డోర్‌మ్యాట్‌ను మళ్లీ అందులో 5 నిమిషాలు ఉంచాలి. ఇలా చేసిన తర్వాత డోర్‌మ్యాట్ పూర్తిగా శుభ్రంగా మారుతుంది.

ఇంట్లో చిన్నపిల్లలు గోడలపై గీసే గీతలు మనకు తొలగించడం కష్టంగా అనిపిస్తుంది. కానీ దానికి సులువైన మార్గం ఉంది. స్ప్రే బాటిల్‌లో కొంచెం వెనిగర్ వేసి కొంత నీళ్లు కలిపితే సరిపోతుంది. దీన్ని గోడపై స్ప్రే చేసి తుడిచేస్తే గీతలు, మరకలు తొలగిపోతాయి.

టీవీ వెనుక భాగంలో ధూళిని తొలగించడం కష్టం అనిపించవచ్చు. మొదట టిష్యూ పేపర్‌తో తేలికగా తుడవాలి. ఆ తర్వాత వెనిగర్ నీళ్లు కలిపిన ద్రావణాన్ని కాటన్ వస్త్రంపై స్ప్రే చేసి టీవీ వెనుక భాగాన్ని తుడవాలి. ఇలా చేస్తే అక్కడ ఉండే మరకలు కూడా తొలగిపోతాయి. ఈ చిట్కాలు పాటిస్తే వంటగది పనులు తక్కువ టైమ్‌లో పూర్తవుతాయి. శ్రమ తగ్గుతుంది.