దలైలామా బర్త్ డే సెలబ్రేషన్స్ కు చైనా అభ్యంతరం.. లడాఖ్ వద్ద బ్యానర్లతో సైనికుల నిరసన

టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా బర్త్ డే సెలబ్రేషన్స్ కి చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. లడాఖ్ లోని డెమ్ ఛుక్ ప్రాంతంలో సింధు నదికి అవతలివైపున చైనా సైనికులు, కొందరు పౌరులు చేత బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు.

దలైలామా బర్త్ డే సెలబ్రేషన్స్ కు చైనా అభ్యంతరం.. లడాఖ్ వద్ద బ్యానర్లతో సైనికుల నిరసన
Dalai Lama
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 12, 2021 | 8:09 PM

టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా బర్త్ డే సెలబ్రేషన్స్ కి చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. లడాఖ్ లోని డెమ్ ఛుక్ ప్రాంతంలో సింధు నదికి అవతలివైపున చైనా సైనికులు, కొందరు పౌరులు చేత బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ నెల 6 న జరిగింది ఈ సంఘటన. 5 ట్రక్కుల్లో వచ్చిన వీరు ఓ విలేజ్ కమ్యూనిటీ సెంటర్ వద్ద ఈ ‘హడావుడి’ చేశారు. దలైలామా జన్మదిన వేడుకలు జరుపుకున్న గ్రామం దీనికి సమీపంలోనే ఉంది. చైనా సైనికులు సుమారు అరగంట సేపు అక్కడే ఉన్నారని.. వారు నిలబడిన భూభాగం మన ఇండియాదేనని కోయిల్ అనే గ్రామ పెద్ద సెవాంగ్ తెలిపాడు. కాగా ఈ ఘటనపై భారత ఆర్మీ ఏ కామెంట్ చేయలేదు. సుమారు 10 రోజుల క్రితం కూడా స్థానికులు సోలార్ పంప్ ఏర్పాటు చేస్తుండగా చైనా సైనికులు అభ్యంతరం ప్రకటించినట్టు సేవాంగ్ చెప్పాడు. ఇలా ఉండగా దలైలామా 86 వ జన్మ దినం సందర్బంగా ప్రధాని మోదీ ఆయనను గ్రీట్ చేస్తూ ట్వీట్ చేశారు. 2014 లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన దలైలామాకు శుభాకాంక్షలు చెప్పడం ఇదే మొదటిసారి. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.

టిబెట్ పట్ల ఇండియూ పాలసీ మారిందా అని వీళ్ళు చెవులు కొరుక్కున్నారు. తాను దలైలామాతో ఫోన్ లో మాట్లాడానని కూడా మోదీ పేర్కొన్నారు. చైనాతో ఇండియాకు గల సంబంధాలపై ఈ కొత్త పరిణామం ప్రభావం చూపుతుందా అని విశ్లేషకులు తర్జన భర్జన పడ్డారు. టిబెట్ పట్ల చైనా వైఖరిని, మన దేశ వైఖరిని ఈ సందర్బంగా పలువురు బేరీజు వేసుకుని చూశారు. ఇక దలైలామా బుద్దుని ఇన్-కార్నేషన్ అన్న అభిప్రాయాన్ని చైనా మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Aamir Khan: అమీర్ ఖాన్‏పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అలాంటి వ్యక్తులు దేశ జనాభాలో…

Telangana Corona: తెలంగాణ కరోనా బులిటెన్.. గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.!

Latest Articles
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు