Aamir Khan: అమీర్ ఖాన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ.. అలాంటి వ్యక్తులు దేశ జనాభాలో…
దేశంలో జనాభా అసమతుల్యతలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ లాంటి వ్యక్తులు కారణమని భారతీయ జనతా పార్టీ నాయకుడు సుధీర్ గుప్తా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విలేకరుల సమావేశంలో
దేశంలో జనాభా అసమతుల్యతలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ లాంటి వ్యక్తులు కారణమని భారతీయ జనతా పార్టీ నాయకుడు సుధీర్ గుప్తా అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విలేకరుల సమావేశంలో మాండ్సౌర్ ఎంపీ సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. “భారత భూభాగం ఒక అంగుళం కూడా పెరగలేదు. కానీ.. జనాభా మాత్రం 140 కోట్లకు చేరువైంది. విభజన సమయంలో పాకిస్తాన్‌కు చాలా ఎక్కువ భూమి వెళ్లిపోయింది. కానీ జనాలు తక్కువ సంఖ్యలో వెళ్లారు. అందులో కొందరు తిరిగి భారత్‌కే వచ్చారు. ఇందుకు అనుగుణంగా భారత భూభాగం మాత్రం పెరగలేదు ” అని అన్నారు.
అలాగే ఈ మధ్య తన రెండవ భార్య కిరణ్ రావు నుంచి విడాకులు తీసుకున్న బాలీవుడ్ స్టార్ నటుడి అమీర్ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ.. “ప్రజల హీరో అయిన అమీర్ తన మొదటి భార్య రీనాతోపాటు.. వారి సంతానాన్ని , రెండో భార్య కిరణ్ రావుతోపాటు వారి కుమారుడిని వదిలేశాడు. ఇప్పుడు మూడో భార్య కోసం ఆరాటపడుతున్నాడు ” అని వ్యాఖ్యానించారు. దేశ జనాభా అసమానతల్లో అమీర్ ఖాన్ వంటి వ్యక్తులు పాత్ర పోషించడం విడ్డూరంగా ఉందని పేర్కోన్నారు.
జూలై 3న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కిరణ్ రావు తమ 15 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీరిద్దరు కలిసి ఈ ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాలో అమీర్ తీరుపై వ్యతిరేకంగా పోస్టులు వచ్చాయి. దంగల్ బ్యూటీ సనా కారణంగానే వీరిద్దరు వీడిపోయారని నెట్టింట్లో కథనాలు వెలువడ్డాయి. అంతకు ముందు అమీర్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చి.. కిరణ్ రావును వివాహం చేసుకున్నారు.
Also Read: ఈ ఫోటోలో ఉన్న టాప్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? టాలీవుడ్లో ఫుల్ బిజీ ఈ ముద్దుగుమ్మ..