AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair loss: క్యాన్సర్ చికిత్స తర్వాత.. మళ్లీ జుట్టు పెరుగుతుందా..?.. నిపుణులు ఏం చెబుతున్నారు

క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి, దీని పేరు వింటేనే చాలా మంది భయపడుతారు. వేరే వ్యాధులతో పోలిస్తే ఇది చాలా ప్రమాదకరం.. సరైన ట్రీట్మెంట్‌ తీసుకోకపోతే దీని వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అయితే ఇటీవల కొంత మంది ఈ వ్యాధితో పోరాడి ప్రాణాలతో బయపడుతున్నారు. అయితే క్యాన్సర్ వల్ల రాలిన జుట్టు చికిత్స తర్వాత తిరిగి వస్తుందా? దీని గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?

Hair loss: క్యాన్సర్ చికిత్స తర్వాత.. మళ్లీ జుట్టు పెరుగుతుందా..?.. నిపుణులు ఏం చెబుతున్నారు
Cancer Hair Loss
Anand T
|

Updated on: Oct 04, 2025 | 7:27 PM

Share

క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారికి జుట్టు రాలిపోతుందని అందరికీ తెలుసిందే. చాలా మంది క్యాన్సర్ వచ్చినప్పుడు తమ జుట్టు రాలిపోవడాన్ని సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. మళ్లీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న తర్వాత జుట్టు వచ్చిన ఫోటోలను షేర్ చేస్తారు. ఇది చూసిన జనాలు వారికి నిజంగానే మళ్లీ జుట్టు వచ్చిందా, లేదా విగ్స్‌ పెట్టుకున్నారా అని అనుకుంటారు. అలానే క్యాన్సర్‌ తర్వాత రాలిన జుట్టు శాశ్వతంగా తిరిగి పెరుగుతుందా? అనే ప్రశ్నకూడా తలెత్తుతుంది. ఈ విషయాన్ని తెలసుకునే ముందు అసలు క్యాన్సర్‌ వ్యాధి వచ్చినప్పుడు జుట్టు ఎందుకు రాలుతుందో చూద్దాం

క్యాన్సర్ రోగులకు జుట్టు ఎందుకు రాలుతుంది

క్యాన్సర్ రోగులలో జుట్టు రాలడానికి అసలు కారణం క్యాన్సర్ చికిత్స సమయంలో కీమోథెరపీ చేసుకోవడం. ఇది క్యాన్సర్‌కు చికిత్సా ప్రక్రియ, ఈ సమయంలో రోగి తలపై వెంట్రుకలు రాలడం ప్రారంభమవుతాయి. కీమోథెరపీ సమయంలో రేడియేషన్ కారణంగా, క్యాన్సర్ రోగులు జుట్టు తరచుగా రాలిపోతుంది. కీమోథెరపీ సమయంలో అందరు రోగులు జుట్టు కోల్పోకపోయినా, కొంతమంది రోగులు రొమ్ము క్యాన్సర్ సమయంలో జుట్టు కోల్పోతారు.

క్యాన్సర్ వల్ల రాలిన జుట్టు మళ్లీ వస్తుందా?

క్యాన్సర్ వ్యాధి కారణంగా రాలిపోయిన జుట్టు చికిత్స తర్వాత తిరిగి వస్తుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. శస్త్రచికిత్స లేదా చికిత్స ముగిసిన తర్వాత రోగులు ఫాలో-అప్ కోసం మా వద్దకు వచ్చినప్పుడు, వారి జుట్టు తిరిగి పెరిగింది. మేము ముందు తప్పు చేసాము, కానీ ఇప్పుడు మేము దాని నుండి బయటపడ్డాము అని నిపుణులు చెబుతున్నారు. తక్కువ విషపూరితమైన కొత్త మందుల వల్ల ఇప్పుడు చాలా తక్కువ జుట్టు రాలిపోతోంది. కొన్ని మందులు జుట్టు రాలడానికి కారణమైనప్పటికీ, అన్ని వెంట్రుకలు రెండు నుండి మూడు నెలల్లోనే తిరిగి పెరుగుతాయని పూణేలోని క్యాన్సర్ సర్జన్ డాక్టర్ మిహిర్ చిటాలే ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.