AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో వాటర్‌ట్యాంక్‌ నుంచి చేపల వాసన వస్తోందా..? ఈ చిట్కాలు పాటిస్తే సరి..

మీ ఇంటి పైకప్పు మీద ఉంచిన వాటర్ ట్యాంక్. పైకప్పు మీద ఉండటం వల్ల వాటర్ ట్యాంక్ తరచుగా శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది.. దీని వల్ల ట్యాంక్‌లో పాకురు, నాచులాగా పేరుకుపోయి దోమలు లేదా నీళ్లలో ఉండే కీటకాలు వృద్ధి చెందుతాయి. ఈ నీటిని వాడుతున్నప్పుడు మనకు దుర్వాసనగా ఉంటుంది. వర్షాకాలంలో ట్యాంక్ నుండి దుర్వాసన వచ్చే నీటి సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ చిట్కాలను పాటించి చూడండి..

వర్షాకాలంలో వాటర్‌ట్యాంక్‌ నుంచి చేపల వాసన వస్తోందా..? ఈ చిట్కాలు పాటిస్తే సరి..
Water Tank
Jyothi Gadda
|

Updated on: Jul 27, 2024 | 4:44 PM

Share

వర్షాకాలంలో అనేక రకాల అంటువ్యాధులు వెంటాడుతుంటాయి. ఆహారం, నీటి ద్వారా వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ప్రత్యేకించి, ఎక్కడైతే వర్షం నీరు నిల్వ ఉంటుందో ఆ ప్రదేశంలో వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా, క్రిములు పెరగడమే కాకుండా దుర్వాసన కూడా వెదజల్లుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ నీరు నిండి ఉండే ప్రదేశం ఉంది. దానిని సరిగ్గా శుభ్రం చేయకపోతే వర్షాకాలంలో నీరు మురికిగా మారి దుర్వాసన వస్తుంది. అది మారెంటో కాదు.. మీ ఇంటి పైకప్పు మీద ఉంచిన వాటర్ ట్యాంక్. పైకప్పు మీద ఉండటం వల్ల వాటర్ ట్యాంక్ తరచుగా శుభ్రం చేయడం కష్టంగా ఉంటుంది.. దీని వల్ల ట్యాంక్‌లో పాకురు, నాచులాగా పేరుకుపోయి దోమలు లేదా నీళ్లలో ఉండే కీటకాలు వృద్ధి చెందుతాయి. ఈ నీటిని వాడుతున్నప్పుడు మనకు దుర్వాసనగా ఉంటుంది. వర్షాకాలంలో ట్యాంక్ నుండి దుర్వాసన వచ్చే నీటి సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి.

1. కొన్ని సార్లు మీరు 15-20 రోజులు మీ ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో ట్యాంక్లో నీరు అలాగే ఉంటుంది. ట్యాంకు మూత తెరిచి ఉంచితే నీరు మురికిగా మారుతుంది. అది దుర్వాసన కూడా వస్తుంది. దోమలు వృద్ధి చెందుతాయి. నీరు శుభ్రంగా ఉండి, దుర్వాసన రాకుండా మూత పెట్టడం మంచిది.

2. ట్యాంక్‌లోని నీరు శుభ్రంగా ఉండాలంటే అందులో క్లోరిన్ మాత్రలు వేయండి. అలాగే, ట్యాప్‌కు పలుచటి బట్టను కట్టినా కూడా నీరు ఫిల్టర్ చేయబడి బకెట్‌లోకి వస్తుంది. మీరు దీన్ని స్నానం చేయడానికి, పాత్రలు లేదా బట్టలు ఉతకడానికి ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

3. వాటర్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ అయిన తర్వాత దానిని శుభ్రం చేయండి. నాచు, పాకురు వంటిది ఏర్పడినట్టయితే పూర్తిగా క్లీన్‌ చేయండి.. ఆ తరువాత ట్యాంక్‌లో మంచినీరు నింపితే వాసన ఉండదు.

4. మీ ఇంట్లో నీటి కొరత ఉన్నా లేదంటే, కరెంట్‌ సమస్య ఉండి ట్యాంక్‌లో మంచినీళ్లు నింపలేకపోతే, పాత నీటిని మరిగించి వాసన పోగొట్టుకోండి. ఆ తర్వాత నీళ్లు చల్లారాక స్నానం చేయడానికి, ఇంటి పనులకు ఉపయోగించటం వల్ల నీటి వృథా ఉండదు. బాక్టీరియా కూడా తొలగిపోతుంది.

5. ట్యాంక్ దుర్వాసన ఎక్కువగా ఉన్నప్పుడు మీరు కావాలంటే మురికి నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోవచ్చు..ఆ తరువాత ఒక గంటపాలు అలాగే వదిలేయండి. ఇప్పుడు ఇంట్లోని అన్ని కుళాయిలు తెరిచి నీటిని వదిలేయండి. క్రమంగా మొత్తం నీరు ట్యాంక్ నుండి బయటకు వెళ్లి పోతుంది. ఇప్పుడు ట్యాంక్‌ను పూర్తిగా శుభ్రం చేసి, ఆపై మంచినీటితో నింపండి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!