వానాకాలంలో వచ్చే వాక్కాయాలు.. కనిపిస్తే వదలొద్దు.. హెల్త్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే అవాక్కే

విటమిన్లు, ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. వాక్కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతో పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం ఉపయోగించేవారు. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల, పోషకాలు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

వానాకాలంలో వచ్చే వాక్కాయాలు.. కనిపిస్తే వదలొద్దు.. హెల్త్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే అవాక్కే
Vakkaya
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2024 | 3:54 PM

వాక్కాయ.. ఈ పేరు దాదాపు గల కాయల గురించి దాదాపు చాలా మందికి తెలియదనే చెప్పాలి. ఎందుకంటే.. ఇది పూర్తిగా అడవులు, గ్రామాలు, మారుమూల పల్లెల్లో మాత్రమే కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ కాయలు చెట్టునిండా విరగకాస్తుంటాయి. వాక్కాయలతో ఎక్కువగా కూర, పచ్చడి రకరకాల వంటకాలు చేసుకుని తింటుంటారు.. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకుని తింటారు. ఎందుకంటే.. ఈ వాక్కాయాలో ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.. అందుకే వీటి లాభాలు తెలిసిన చోట వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..వగరుపులుపు కలిసిన ఈ వాక్కాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఉదర సమస్యలను నివారించడానికి ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తొలగించడానికి సహాయపడుతుంది.

సాధారణంగా వాక్కాయ మొక్క అక్కడక్కడా ముళ్ళుండే పొద జాతి, కంప మొక్క. వాక్కాయలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి, ఫైబర్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, అంథోసైనిన్స్‌, ఫినోలిక్‌ యాసిడ్స్‌ అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ పాలిఫినల్స్‌ వలన కణాలు దెబ్బతినకుండా, ఇన్ఫెక్షన్లకు రాకుండా రక్షిస్తుంది. మధుమేహాన్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ వాక్కాయ రుచిలో వగరుగా, పుల్లగా ఉంటుంది. కానీ, తరచూగా తింటూ ఉంటే.. మూత్రపిండాలలో రాళ్ళని సైతం కరిగించే శక్తి ఈ వాక్కాయకు ఉంది. విటమిన్ సి అధికంగా ఉన్న ఈ వాక్కాయ అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఉబ్బసం చికిత్స నుండి చర్మ వ్యాధుల వరకు, వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ఇవి కూడా చదవండి

వాక్కాయ శరీరంలోని పిత్తాశయం, చిగుళ్ళలో రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను నివారిస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంలో అత్యంత ప్రయోజనకారి వాక్కాయ. దంతాలు పుచ్చిపోకుండా చేయడమే కాదు నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది. వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

సీజన్ లో దొరికే ఈ వాక్కాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మురుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్లు, ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. వాక్కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతో పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం ఉపయోగించేవారు. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల, పోషకాలు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..