Horse Gram Benefits: మందుల అవసరం లేదు.. ఉలవలతో ఈ సమస్యలన్నీ పరార్.. నిండు ఆరోగ్యం!

తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Horse Gram Benefits: మందుల అవసరం లేదు.. ఉలవలతో ఈ సమస్యలన్నీ పరార్.. నిండు ఆరోగ్యం!
Horse Gram
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2024 | 4:20 PM

మన చుట్టూ లభించే కాయలు, విత్తనాల ప్రయోజనాల గురించి మనకు పూర్తిగా తెలియదు. వాటి ప్రయోజనాలు, సరైన ఉపయోగ పద్ధతి తెలుసుకుని ఉపయోగిస్తే మాత్రం తీవ్రమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలకు వాటితో చికిత్స చేయవచ్చు. అన్నింటికంటే, ఆయుర్వేదంలో చెట్లు, మొక్కలు, ఆకులు, వాటి పండ్లు, విత్తనాలు మొదలైనవి అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసేవి ఉన్నాయి. అటువంటి ధాన్యాలలో ఒకటి ఉలవలు. ఈ రోజు మనం ఈ ఉలవల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఉలవలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు శక్తిని అందిస్తాయి. అందువల్ల వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. పెరిగే పిల్లలకు ఉలవలు తినిపిస్తే చాలా మంచిది. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలలో సహాయపడతాయి. వారిని బలంగా ఉంచుతాయి. కిడ్నీ సమస్యలను నివారించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలోని పోషకాలు కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. స్థూలకాయాన్ని తగ్గించడంలో ఉలవలు ఉపయోగపడతాయి. ఉలవలు శరీరం నుండి రాళ్లను తొలగించడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. పెరిగిన కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. ఉలవలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు శరీరంపై కనిపిస్తాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని బలపరుస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తీసుకోవడం చాలా మంచిది. ఉలవలు తినడం ద్వారా ఎక్కిళ్లు రాకుండా ఉంటాయి. బరువు ఎక్కువగా ఉన్నవారు ఉలవలు తింటే చాలా మంచిది. వీటిలోని ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంచుతుంది. ఉలవలు శరీరంలోని రాళ్లపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇది శరీరంలోని ఏ భాగానైనా రాళ్లు ఏర్పడితే తొలగిస్తుంది. దీని వాడకంతో చక్కెర స్థాయి కూడా చాలా వరకు నియంత్రించబడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరిగిన కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి పనిచేస్తుంది. బరువు తగ్గడంలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. యువత, మహిళలు, వృద్ధులు, పిల్లలు సులభంగా ఉపయోగించగల ఆహార ఔషధం ఇది. ఉలవలతో శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని ఆహారంగా అనేక విధాలుగా కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాల కదలికల్ని మెరుగుపరుస్తుంది. తద్వారా మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఓ కప్పు ఉలవ చారుకు సమానంగా కొబ్బరి నీళ్లు తీసుకుంటే మూత్రంలో మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. తరచూ మూత్రంలో మంటతో బాధపడేవారు ఈ చిట్కా ట్రై చేయండి. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించడంలో ఉలవలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. తద్వారా గుండెకు రక్తసరఫరా మెరుగుపర్చి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడతాయి. జ్వరంతో పాటు ఆయాసం, దగ్గు వంటి సమస్యలు ఉన్నవారు ఉలవల కషాయం తాగడం మంచిది. ఈ కషాయం జ్వరం, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..