AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మీ లగేజీ పోయిందా..? అయితే, ఇలా పరిహారం పొందండి..!

భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తున్నారు. వీరి కోసం భారతీయ రైల్వే వేలాది రైళ్లను నడుపుతోంది.

Vande Bharat: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మీ లగేజీ పోయిందా..? అయితే, ఇలా పరిహారం పొందండి..!
Vande Bharat Sleeper Train
Balaraju Goud
|

Updated on: Oct 15, 2024 | 10:10 AM

Share

భారతీయ రైల్వే ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ. ప్రతిరోజు కోట్లాది మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణిస్తున్నారు. వీరి కోసం భారతీయ రైల్వే వేలాది రైళ్లను నడుపుతోంది. రైలులో ప్రయాణించడానికి భారతీయ రైల్వే అనేక నియమాలను రూపొందించింది. రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణీకుడు ఈ నియమాలను పాటించాలి. ప్రయాణీకులను పర్యవేక్షించడానికి చాలా నియమాలు ఉన్నాయి.

ప్రయాణీకుల సౌకర్యార్థం అనేక నిబంధనలు ఉన్నాయి. ఈ నియమాలలో ఒకటి పోయిన సామాను గురించి. భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్. మీరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కడికైనా వెళుతుంటే, మీ సామాను రైలులో ఎక్కడో పోతుంది. అటువంటి పరిస్థితిలో మీకు భారతీయ రైల్వేలు పరిహారం అందజేస్తాయన్న విషయం తెలుసా? ఈ పరిహారం ఎలా తీసుకోవాలో, దాని ప్రక్రియ ఏమిటో చూద్దాం..!

మీరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నట్లయితే. ఆ సమయంలో మీ వస్తువులు చోరీకి గురైనా లేదా ఎక్కడో పోయినా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ముందుగా మీరు అటెండర్, గార్డు లేదా GRP ఎస్కార్ట్‌కి దీని గురించి కొంత సమాచారం ఇవ్వాలి. మీ వద్ద ఉన్న వస్తువులు చోరీకి గురయ్యాయో చెప్పాలి. దాని గురించి మీకు సవివరమైన సమాచారం ఇవ్వడం ముఖ్యం. మీ లగేజీ ఏ రైల్వే స్టేషన్‌లో మిస్ అయ్యిందో కూడా చెప్పాల్సి ఉంటుంది. తద్వారా మీ లగేజీ దొంగిలించిన స్టేషన్‌కు రైల్వే శాఖ ఈ సమాచారాన్ని చేరవేస్తుంది. దాన్ని తిరిగి పొందడానికి ప్రాసెస్ చేయవచ్చు. కానీ మీ పోయిన వస్తువు కనుగొనలేకపోతే. అప్పుడు మీకు రైల్వే పరిహారం అందజేస్తుంది.

మీకు ఎంత పరిహారం వస్తుంది?

మీ పోయిన సామాను రైలులో కనిపించనప్పుడు.. మీ లగేజీ ధరను రైల్వేశాఖ లెక్కిస్తుంది.దాని ఆధారంగా రైల్వే పరిహారం ఇస్తుంది. సాధారణంగా రైల్వేశాఖ కిలోకు రూ.100 చొప్పున పరిహారం ఇస్తుంది. లగేజీ రుసుము చెల్లించి లగేజీని బుక్ చేసుకున్న వారికి మాత్రమే రైల్వే శాఖ నుండి లగేజీ నష్టపరిహారం లభిస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..