Alcohol: ఆల్కహాల్‌ శాఖాహారమా.? మాంసాహారమా.? అసలు విషయం ఏంటంటే..

ఇదిలా ఉంటే ఆల్కహాల్‌ శాఖాహారమా.? మాంసాహారమా.? అనే ఒక సందేహం ఉండనే ఉంటుంది. చాలా మంది ఉపావసం ఉన్న వారు కూడా ఆరోజు కేవలం నాన్‌ వెజ్‌ తినకుండా మద్యాన్ని సేవిస్తుంటారు. అదేం అంటే.. ఆల్కహాల్‌ మాంసాహారం కాదని అందుకే ఆల్కహాల్‌ సేవిస్తున్నామని చెబుతుంటారు. అయితే ఇదంతా ఇలా ఉంటే అసలు...

Alcohol: ఆల్కహాల్‌ శాఖాహారమా.? మాంసాహారమా.? అసలు విషయం ఏంటంటే..
Alcohol
Follow us

|

Updated on: Oct 15, 2024 | 11:30 AM

ఆల్కహాల్‌.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఈ అలవాటు ఉంది. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా మందు రాయుళ్లు మాత్రం ఆల్కహాల్‌ తీసుకోవడం మాత్రం మానరు. అయితే ప్రస్తుత రోజుల్లో ఆల్కహాల్ సేవించడం అనేది ఒక పార్టీ సింబల్‌గా కూడా మారిపోయింది. రెస్పాన్సిబుల్ డ్రింకింగ్‌ పేరుతో పరిమితంగా ఆల్కహాల్‌ తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఎంత తీసుకున్నా ఆల్కహాల్‌ ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు చెబుతూనే ఉంటారు.

ఇదిలా ఉంటే ఆల్కహాల్‌ శాఖాహారమా.? మాంసాహారమా.? అనే ఒక సందేహం ఉండనే ఉంటుంది. చాలా మంది ఉపావసం ఉన్న వారు కూడా ఆరోజు కేవలం నాన్‌ వెజ్‌ తినకుండా మద్యాన్ని సేవిస్తుంటారు. అదేం అంటే.. ఆల్కహాల్‌ మాంసాహారం కాదని అందుకే ఆల్కహాల్‌ సేవిస్తున్నామని చెబుతుంటారు. అయితే ఇదంతా ఇలా ఉంటే అసలు ఆల్కహాల్‌ మాంసాహారమా.? శాఖహారమా ఇప్పుడు తెలుసుకుందాం..

ఆల్కహాల్‌ రకం ఆధారంగా దాని తయారీలో ఉపయోగించే వస్తువులు మారుతుంటాయి. సాధారణంగా బీర్‌ తయారీలో బార్లీ గింజలను, ఈస్ట్‌ను ఉపయోగిస్తుంటారు. అలాగే కొన్ని రకాల విస్కీలు, వైన్స్‌ తయారీలో కూరగాయలను లేదా పండ్లను పులియపెడుతుంటారు. వీటికి ఈస్ట్‌ను జోడించడం ద్వారా ఇందులో ఉండే చక్కెర ఆల్కహాల్‌గా మారుస్తుంది. కాబట్టి ఆల్కహాల్‌ శాఖాహారమే అనే వాదన వినిపిస్తుంటుంది.

ముఖ్యంగా బీర్‌, వైన్‌, వోడ్కా, జిన్‌, రమ్‌ వంటివి ధాన్యాలు.. పండ్లతో తయారు చేస్తారు. కాబట్టి ఇవి శాఖాహారంగా భావిస్తుంటారు. అయితే కొన్ని రకాల వైన్ల తయారీలో మాత్రం క్లారిఫికేషన్ అనే ప్రక్రియను ఉపయోగిస్తుంటారు. ఈ ప్రక్రియలో వైన్‌ తయారీకి.. గుడ్డులోని తెల్లసొన, ఐసింగ్‌లాస్ (చేపల ఈత సంచుల నుండి సేకరించిన పదార్థం) వంటి వస్తువులను వాడుతారు. కాబట్టి ఇవి మాంసాహారం కిందికి వస్తాయి. అయితే ఆల్కహాల్‌ శాఖాహారమా.? మాంసాహారమా.? అన్న విషయం ఎలా తెలుసుకోవాలంటే.. సదరు మద్యం బాటిల్‌పై దాని తయారీకి ఉపయోగించిన వస్తువుల వివరాలు ఉంటాయి. వీటి ఆధారంగా దాని తయారీలో ఏం ఉపయోగించారో తెలుసుకోవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..