Goods Rail: లోకో పైలట్ లేకుండానే పరుగులు తీసిన గూడ్స్ రైలు.. ఎలా ఆగిందో తెలుసా..?
జమ్మూ కాశ్మీర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లోకో పైలట్ లేకుండా జమ్మూలోని కతువా నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ఓ గూడ్స్ రైలు. భారతీయ రైల్వేకు చెందిన గూడ్స్ రైలు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని దాసుహాలోని ఉచి బస్సీకి చేరుకుంది. చివరికి ఎలాగోలా ఈ రైలు ఆగింది.

జమ్మూ కాశ్మీర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లోకో పైలట్ లేకుండా జమ్మూలోని కతువా నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది ఓ గూడ్స్ రైలు. భారతీయ రైల్వేకు చెందిన గూడ్స్ రైలు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని దాసుహాలోని ఉచి బస్సీకి చేరుకుంది. చివరికి ఎలాగోలా ఈ రైలు ఆగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై ప్రజల నుంచి భిన్నమైన స్పందన వస్తోంది. రైల్వే శాఖ అధికారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R) జమ్ములోని కథువా రైల్వేస్టేషన్‌లో ఆగింది. అయితే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోయారు. అయితే పఠాన్ కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. గంటకు 100 కిలో మీటర్ల వేగం అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉచ్చి బస్సీ రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి అపాల్సి వచ్చింది.
A Freight Train which was at a halt at Kathua Station suddenly started running due to a slope towards Pathankot, without the driver. The train was stopped near Ucchi Bassi in Mukerian Punjab. An inquiry into the matter has been started: Divisional Traffic Manager, Jammu.… pic.twitter.com/ERv122pi4P
— ANI (@ANI) February 25, 2024
ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ విషయానికి సంబంధించి రైల్వే అధికారులు స్పందించారు. దర్యాప్తు ప్రారంభించినట్లు జమ్మూ డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని ఆయన వెల్లడించారు.
ఇంతకుముందు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 2020లో జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బర్సువా రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు నిలబడి ఉంది. ఈ సమయంలో రైలు ఒక్కసారిగా బోల్తా పడింది. దీని తరువాత, రైలు బిమల్‌ఘర్ రైల్వే స్టేషన్ వైపు వెనుకకు కదలడం ప్రారంభించింది. గంటకు 100 కి.మీ వేగంతో పరుగెత్తడం ప్రారంభించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




