టైగర్ రిజర్వ్‌లో జంగిల్ సఫారీ చేయాలనుకంటున్నారా.. సర్కార్ సీరియస్ వార్నింగ్!
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టైగర్ రిజర్వ్‌లలో మీ కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త చాలా ముఖ్యం. టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో సెల్ఫీలపై నిషేధం విధించింది. మధ్యప్రదేశ్‌లోని అన్ని టైగర్ రిజర్వ్‌లలో మొబైల్ ఫోన్ వాడకం, సెల్ఫీలను పూర్తిగా నిషేధించింది.

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టైగర్ రిజర్వ్‌లలో మీ కుటుంబంతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త చాలా ముఖ్యం. టైగర్ రిజర్వ్ ఫారెస్టుల్లో సెల్ఫీలపై నిషేధం విధించింది. మధ్యప్రదేశ్‌లోని అన్ని టైగర్ రిజర్వ్‌లలో మొబైల్ ఫోన్ వాడకం, సెల్ఫీలను పూర్తిగా నిషేధించింది. టైగర్ రిజర్వ్‌ల ప్రధాన ప్రాంతాలలో పర్యాటకులు ఇకపై తమ మొబైల్ ఫోన్‌లతో ఫోటోలు లేదా వీడియోలు తీయకూడదని హెచ్చరించింది.
మధ్యప్రదేశ్‌లోని అన్ని టైగర్ రిజర్వ్‌లలోని ప్రధాన ప్రాంతాలలో మొబైల్ ఫోన్ వాడకంపై పూర్తి నిషేధం విధించింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 16 నుండి సత్పురా, పెంచ్, బంధవ్‌గఢ్, కన్హాతో సహా రాష్ట్రంలోని అన్ని టైగర్ రిజర్వ్‌లలో అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం, పర్యాటకులు సఫారీల సమయంలో వారి మొబైల్ ఫోన్‌లను ఉపయోగించకూడదు. వారు ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేయడానికి వీలులేదు.
నవంబర్ 17న సుప్రీంకోర్టు జారీ చేసిన ఒక ముఖ్యమైన ఆదేశాన్ని అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది. టి.ఎన్. గోదవర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, టైగర్ రిజర్వ్‌ల ప్రధాన ప్రాంతాలలో మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోటో, వీడియో రికార్డింగ్‌తో సహా మొబైల్ ఫోన్‌లను అధికంగా ఉపయోగించడం వల్ల వన్యప్రాణుల సహజ కదలికలు, ప్రవర్తనలకు అంతరాయం కలుగుతుందని, వన్యప్రాణుల సంరక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భారత అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.
సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా, మధ్యప్రదేశ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) షభర్జన్ సేన్ సోమవారం ఒక అధికారిక ఉత్తర్వు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని టైగర్ రిజర్వ్‌ల ఫీల్డ్ అడ్మినిస్ట్రేటర్లు పర్యాటక ప్రాంతాలలో,ముఖ్యంగా కోర్ ప్రాంతాలలో మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఈ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. సఫారీల సమయంలో పర్యాటకులు నియమాలను పాటించేలా చూసుకోవాలని రిజర్వ్ మేనేజ్‌మెంట్‌ను కోరింది.
మొబైల్ ఫోన్ వాడకం మాత్రమే కాదు, సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించి, టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లో కూడా కఠినమైన చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల, బఫర్ జోన్‌లో నిర్వహిస్తున్న నైట్ సఫారీని కూడా నిలిపివేశారు. డిసెంబర్ 1, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా నైట్ సఫారీలపై పూర్తి నిషేధం అమలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు, పర్యాటకులు పగటి సఫారీలు, సాయంత్రం సఫారీలలో పాల్గొనడానికి మాత్రమే అనుమతించడం జరుగుతుంది.
నవంబర్ 17, 2025 నాటి సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించి, కన్హా, బంధవ్‌గఢ్, పెంచ్ మరియు సాత్పురాతో సహా అన్ని టైగర్ రిజర్వ్ నిర్వహణలు బఫర్ జోన్‌లలో నైట్ సఫారీలను తక్షణమే నిలిపివేశాయి. భోపాల్‌లోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, వైల్డ్‌లైఫ్ జారీ చేసిన సూచనలను అనుసరించి, అటవీ శాఖ నైట్ సఫారీలను శాశ్వతంగా నిలిపివేసింది.
వన్యప్రాణులకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం, వాటి సహజ ప్రవర్తనకు అంతరాయం కలగకుండా చూసుకోవడం ఈ నిర్ణయాల ప్రాథమిక ఉద్దేశ్యం అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అందువల్ల, నూతన సంవత్సర రోజున టైగర్ రిజర్వ్‌ను సందర్శించే పర్యాటకులు ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. లేకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




