ఈ పాము గురించి తెలుసా.. కాటు వేస్తే కాటికే..
పాములు చాలా రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని కాటేసి ఉంటే మరికొన్ని పాములు కాటు వేయకున్నా ప్రాణాలు తీస్తుంటాయి. మొత్తం ప్రపంచంలోనే 300 జాతులకు పైగా పాములు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రపంచంలోనే ఒక పాము చాలా ప్రమాదకరం అయినదంట. అది కాటు వేస్తే చాలు సెకన్స్‌లలో ప్రాణం పోతుందంట. ఇంతకీ ఆ పాము ఏదో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 25, 2025 | 8:04 PM

ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములు చాలా ఉన్నాయి. ముఖ్యంగా భారత దేశంలో చాలా విషపూరితమైన పాముల్లో రక్తపింజరి, నాగు పాము, త్రాచుపాము వంటివి మొదటి స్థానాల్లో ఉంటాయి. వీటిని చూస్తే చాలు చాలా మంది భయపడి పోతుంటారు.

అయితే భారత దేశంలోనే కాకుండా, ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాముల్లో ఇన్లాండ్ తైవాన్ ఒకటి. ఇది చాలా డేంజరస్ పాము, ఈ పాము గనుక కాటు వేస్తే ఏకంగా కాటికే అంటున్నారు శాస్త్రీయ పరిశోధకులు.

ఈ తైపాన్ పాములు ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తాయంట. వీటిని ఆస్ట్రేలియా ఫియర్స్ స్నేక్స్ అని కూడా పిలుస్తారు. దీనిలోని ఒక విషపు చుక్క వంద మందిని కూడా చంపగలిగే సామర్థ్యం ఉంటుందంట. ఇద ఎక్కువగా ఏడారి ప్రాంతాల్లో సంచరిస్తుంటుంది.

అయితే ఇంత విషపూరితమైన ఈ పాములకు ఓ స్పెషాలిటీ ఉంటుందంట. అది ఏమిటంటే? ఇవి సీజన్ బట్టి దాని రంగును మార్చుకుంటుందంట. వేసవిలో లేత గోధుమ రంగు, చలికాలంలో ముదురు గోధుమ, వర్షాకాలంలో రాగి ఇలా వాతావరణంలో మార్పులను బట్టి దాని రంగును సులభంగా మార్చుకుటుందంట.

ఈ పాములు ఎక్కువగా ఎలుకలు, చిన్న క్షీరదాలను తిని బతికేస్తాయి. ఇక ఇవి ఏ మనిషినైనా కాటు వేస్తే, అవి ఆ వ్యక్తి కండరాు, రక్తం పై ప్రభావం చూపుతాయి. అంతే కాకుండా చాలా త్వరగా ప్రాణం తీసేస్తాయంట. ( నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు)



