LIC Jeevan Utsav: ఐదేళ్ల పాలసీ.. జీవితాంతం ఆదాయం.. ఎల్ఐసీ కొత్త స్కీమ్‌లో డబుల్ బెనిఫిట్స్
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లో కూడా ఈ తరహా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులకు మరింత సౌకర్యంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా మరో పొదుపు ప్లస్ బీమా తో పాటు గ్యారంటీ రిటర్న్స్ విధానంలో ఓ కొత్త పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. నవంబర్ 29న ప్రారంభించిన ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ప్రతి మనిషి జీవితానికి భద్రత అవసరం. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు, ప్రమాదాలు చోటుచేసుకుంటాయో ఎవరూ ఊహించలేరు. అలాంటి సందర్భంలో కుటుంబ పెద్దకు, పోషించే వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగితే.. ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతుంది. అందుకే ప్రతి కుటుంబానికి బీమా అనేది ఉండాలని చాలా మంది నిపుణులు, ఆర్థిక వేత్తలు చెబుతుంటారు. అయితే ఈ జీవిత బీమా(లైఫ్ ఇన్సురెన్స్)లు తీసుకోవాలంటే అందరిలో ఇది వరకూ ఏదో ఒక రకమైన నెగిటివ్ సెంటిమెంట్ ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఆ విధమైన ఆలోచనల నుంచి చాలా మంది బయటకు వచ్చి జీవిత బీమాలను తీసుకుంటున్నారు. దీనికి అదనంగా మనం బీమా నిమిత్తం చెల్లిస్తున్న మొత్తాన్ని కూడా పొదుపు వైపు మళ్లిస్తూ పలు ఇన్సురెన్స్ కంపెనీలు పొదుపు ప్లస్ బీమా కవరేజీ రెండింటినీ అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది పాలసీ తీసుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లో కూడా ఈ తరహా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులకు మరింత సౌకర్యంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా మరో పొదుపు ప్లస్ బీమా తో పాటు గ్యారంటీ రిటర్న్స్ విధానంలో ఓ కొత్త పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. నవంబర్ 29న ప్రారంభించిన ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎల్ఐజీ జీవన్ ఉత్సవ్..
ఎల్ఐజీ జీవన్ ఉత్సవ్ ప్లాన్ అనేది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, జీవితాంతం బీమా కవరయ్యే పాలసీ. ఆ పాలసీని ఒకసారి తీసుకుంటే ప్రీమియం చెల్లింపు ముగిసినా కూడా బతికున్నంత కాలం ఆదాయం పొందే వీలుంటుంది. హామీ మొత్తంలో 10శాతం ఆదాయంగా మీకు చెల్లిస్తారు.
ఎవరు అర్హులంటే..
ఈ పాలసీని ఎవరైనా తీసుకోవచ్చు. మైనర్లు కూడా అర్హులే. కనీస కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. గరిష్టంగా 65 సంవత్సరాలు పాలసీ పనిచేస్తుంది. పాలసీ చెల్లించేందుకు గరిష్ట వయసు 75 ఏళ్లు ఉంటుంది. ఐదేళ్ల నుంచి 16ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కనీస బీమా మొత్తం రూ. 5లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కాలవ్యవధిని బట్టి వెయింటింగ్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల కాల వ్యవధికి ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకుంటే ఐదేళ్లు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అదే ఆరేళ్లు ఎంచుకుంటే నాలుగేల్లు, ఏడేళ్లు ఆప్షన్ తీసుకుంటే మూడేళ్లు, ఎనిమిదేళ్ల నుంచి 16ఏళ్ల ప్రీమియం చెల్లింపు వ్యవధి ఎంచుకుంటే రెండేళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ ముగిసిన తర్వాత బీమా హామీ మొత్తంలో ఏటా 10శాతం చొప్పున జీవితాంతం ఆదాయం పొందొచ్చు. జీవించి ఉన్నంతకాలం జీవిత బీమా హామీ ఉంటుంది.
రెండు ఆప్షన్లు..
ఈ ప్లాన్లో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి రెగ్యూలర్ ఆదాయం కాగా రెండోది ఫ్లెక్సీ ఆదాయం. మొదటిది ఎంచుకుంటే ఏటా చివరిలో మొత్తం బీమా హామీ నుంచి 10శాతం ఆదాయం వస్తుంది. అదే ఫ్లెక్సీ ఆదాయం ఎంచుకుంటే బీమా మొత్తంలో 10శాతం ప్రతిఫలం అందుతుంది. అదే మొత్తం ఎల్ఐసీ వద్దనే ఉంచేస్తే 5.5శాతం చక్రవడ్డీ అసలుకు జమవుతుంది. ఇలా చేస్తే పెద్ద మొత్తంలో నగదు జమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ పాలసీ దారుడు మధ్యలోనే మరణిస్తే అప్పటి వరకూ చెల్లించిన పాలసీ ప్రీమియంలతో పాటు డెత్ బెనిఫిట్స్ నామినీకి చెల్లిస్తారు.
డెత్ బెనిఫిట్స్ ఇలా..
పాలసీదారుడు అకాల మరణం చెందితే డెత్ బెనిఫిట్స్ వస్తాయి. అది డెత్ బీమా మొత్తం ప్లస్ గ్యారెంటీడ్ అడిషన్స్ ఎల్ఐసీ చెల్లిస్తుంది. డెత్ బీమా మొత్తం లేదా మీరు చెల్లించే వార్షిక ప్రీమియానికి ఏడు రెట్లు ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి అందిస్తారు. గ్యారెంటీ అడిషన్స్ ఎలా ఇస్తారంటే.. మీ పాలసీలో చెల్లించిన ప్రీమియంలో ప్రతి రూ. 1000లకు రూ. 40చొప్పున కలుపుతూ వస్తారు. వీటికి అదనంగా ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్, డిజెబులిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూటర్మ్ అస్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ న్యూ క్రిటికల్ ఇల్ నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వెయివర్ బెనిఫిట్ రైడర్ ను ఈ పాలసీకి యాడ్ చేసుకోవచ్చు.
ప్రీమియం ఎంతంటే..
ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ కనీస బీమా మొత్తం రూ. 5లక్షల బీమా మొత్తాన్ని 30ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి, ఐదేళ్ల కాలపరిమితితో తీసుకుంటే ఏటా 2.17లక్షలు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 8ఏళ్ల ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే రూ. 1.43లక్షల, 16ఏళ్ల ప్రీమియం టెర్మ్ ఎంచుకుంటే రూ. 58వేలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ఫీచర్లు ఇవే..
ఈ పాలసీలో ప్రీమియం టర్మ్, వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఏటా ఆదాయం పొందే వీలుంటుంది. అలాగే రెగ్యూలర్ ఆదాయం వద్దనుకుంటే అంతే ఎల్ఐసీ వద్దే ఉంచేసుకుంటే చక్రవడ్డీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకూ బీమా సదుపాయం కల్పిస్తారు. దీనిలో 90 రోజుల వయస్సున పిల్లల నుంచి 65ఏళ్ల వృద్ధుల వరకూ ఎవరైనా పాలసీలో చేరొచ్చు. వివిధ రైడర్లు అందుబాటులో ఉంటాయి. రుణ సదుపాయం కూడా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..