Real Color of Sun: సూర్యుడి అసలు రంగు ఏంటో తెలుసా? నిజం తెలిస్తే షాక్ అవుతారు..!
సూర్యుని అసలు రంగు ఏమిటో తెలుసా? పసుపు, ఎరుపు, నారింజ రంగు అని చెబుతారా? అస్సలు కానేకాదు. వంద శాతం ఇది తప్పు సమాధానం. చంద్రుడిని జయించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని వైపు కవాతు చేస్తూ వెళ్తోంది. ఈ మిషన్‌లో కూడా ఇస్రో విజయం సాధిస్తుందని ఆశిద్దాం. అయితే, ISRO సూర్యుడిని చేరుకోవడానికి ముందు ఇవాళ మనం ఓ ఇంట్రస్టింగ్ నిజాలు తెలుసుకుందాం. సూర్యుడి గురించి మనం కొన్ని సాధారణ అంశాలను నిత్యం స్మరించుకుంటాం. అయితే, కొన్ని విషయాల్లో మనం పొరపడుతున్నామని సైన్స్ చెబుతోంది. చిన్నప్పటి నుండి మనం సూర్యుడిని కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు ఎరుపుర, మరికొన్నిసార్లు నారింజ రంగులో చూస్తున్నాం. కానీ...

సూర్యుని అసలు రంగు ఏమిటో తెలుసా? పసుపు, ఎరుపు, నారింజ రంగు అని చెబుతారా? అస్సలు కానేకాదు. వంద శాతం ఇది తప్పు సమాధానం. చంద్రుడిని జయించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని వైపు కవాతు చేస్తూ వెళ్తోంది. ఈ మిషన్‌లో కూడా ఇస్రో విజయం సాధిస్తుందని ఆశిద్దాం. అయితే, ISRO సూర్యుడిని చేరుకోవడానికి ముందు ఇవాళ మనం ఓ ఇంట్రస్టింగ్ నిజాలు తెలుసుకుందాం. సూర్యుడి గురించి మనం కొన్ని సాధారణ అంశాలను నిత్యం స్మరించుకుంటాం. అయితే, కొన్ని విషయాల్లో మనం పొరపడుతున్నామని సైన్స్ చెబుతోంది. చిన్నప్పటి నుండి మనం సూర్యుడిని కొన్నిసార్లు పసుపు, కొన్నిసార్లు ఎరుపుర, మరికొన్నిసార్లు నారింజ రంగులో చూస్తున్నాం. కానీ వాస్తవానికి సూర్యుడు ఇందులో ఏ రంగులోనూ లేడు. సూర్యుని అసలు రంగు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
సూర్యుడు మనకు పసుపు, నారింజ రంగులో ఎందుకు కనిపిస్తాడు?
భూమి నుండి, సూర్యుడు మనకు వేర్వేరు సమయాల్లో వివిధ రంగులలో కనిపిస్తాడు. ఉదాహరణకు సూర్యోదయం వేళలో గానీ, సూర్యాస్తమయం సమయంలో గానీ సూర్యుడిని చూసినప్పుడు, అది ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది. అయితే పగటిపూట సూర్యుడిని చూస్తే పసుపు రంగులో కనిపిస్తుంది. అయితే, ఈ మూడు రంగులతో సూర్యుడికి ఎలాంటి సంబంధం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా భూమి వాతావరణం, మన కళ్ళ కారణంగా జరుగుతుందట. నిజానికి, సూర్యరశ్మి మన కళ్లకు చేరకముందే మన వాతావరణాన్ని తాకుతుంది. ఇక్కడ కాంతి వివిధ చర్యల కారణంగా దాని రంగు చాలా వరకు మనకు పసుపు రంగులో కనిపిస్తుంది. అదేవిధంగా, సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో, సూర్యరశ్మి భూమిపై వేరే విధంగా పడటం వలన అది మన కళ్ళకు ఎరుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది.
సూర్యుని అసలు రంగు ఏమిటి?
NASA నివేదిక ప్రకారంర.. నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షం నుండి సూర్యుని చిత్రాన్ని తీసి, దానిని చూసినప్పుడు, దాని రంగు ఎరుపు, పసుపు, నారింజ రంగు కాకుండా.. తెలుగు రంగులో కనిపించింది. అంటే సూర్యుని అసలు రంగు తెలుపు. ఇప్పుడు మరో సందేహం కూడా మీకు రావొచ్చు. సూర్యుని రంగు తెల్లగా ఉంటే.. భూమి నుండి మనకు ఎందుకు తెల్లగా కనిపించదు? ఎందుకంటే సూర్య కిరణాలు మన కళ్లకు చేరినప్పుడు, వాటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. అది మన కళ్ళలోని ఫోటోరిసెప్టర్ కణాలను సంతృప్తపరుస్తుంది. అలాంటి పరిస్థితిలో, సూర్యుని నిజమైన రంగు తెలుపునకు బదులుగా పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




