Horoscope Today(31st Aug): ఇతరుల వాదోపవాదాల్లో జోక్యం చేసుకోవద్దు.. 12రాశుల వారికి రాశిఫలాలు..
Horoscope Today (31st August): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారంనాడు (ఆగస్టు 31, 2023) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

Horoscope Today (31st August): భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారంనాడు (ఆగస్టు 31, 2023) 12 రాశుల వారి రాశిఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశివారికి అధికార యోగం పట్టే సూచనలున్నాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు ఆధారపడడం ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాలు చాలావరకు బిజీగా మారిపోతాయి. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. ఆదాయం పెరగడానికి చేసే ఎటువంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాన్నిస్తుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలున్నప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇతర ఉద్యోగాలకు వెళ్లాలన్న మీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో బాధ్యతలు, లక్ష్యాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.




మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో సొంత లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, తోటి ఉద్యోగులకు సహా యపడతారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. వ్యాపారాలను విస్తరించడానికి ఇది సమయం కాదు. ఇతరుల వాదోపవాదాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలను, లక్ష్యాలను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. బంధువుల రాకపోకలుంటాయి. వ్యాపార భాగస్వాములతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహకాలు అందుతాయి. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. తోబుట్టువులతో గానీ, దగ్గర బంధువులతో గానీ చాలా కాలంగా కొనసాగు తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరి ష్కారం విషయంలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొందరు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యో గంలో కొద్దిపాటి ఇబ్బందులున్నప్పటికీ సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ రాశివారికి సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఆలోచనలను, ప్రయత్నాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఇతరులకు సహాయం చేసే పనులు చేపడతారు. వృత్తి, ఉద్యోగాలలో కూడా సహోద్యోగులకు ఇతోధికంగా సహాయపడడం జరుగుతుంది. వ్యాపారాలు సానుకూలంగా కొనసాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కెరీర్ పరంగా సానుకూల వాతావరణం ఉంటుంది. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. ఇంటా బయటా శ్రమాధిక్యత ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. కొద్దిగా వ్యయ ప్రయాసలు ఉన్నప్పటికీ వ్యక్తిగత వ్యవహారాలను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అయితే, సహోద్యోగులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో డాక్టర్లను సంప్రదించాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2): ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయాలు సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. పెద్దల సహాయంతో కుటుంబ వ్యవహారాలు చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు. అటు ఉద్యోగపరంగానే కాకుండా, వ్యాపార పరంగా కూడా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలపరంగా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ఒకటి రెండు ప్రధానమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కొందరు బంధువులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అంచ నాలకు మించి మెరుగుపడుతుంది. ఆస్తి లేదా డబ్బు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారా లలో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యో గుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవ సరం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పెండింగ్ పనులు తేలికగా పూర్తవుతాయి.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.