Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Lake: భూమిపై అత్యంత ప్రమాదకరమైన సరస్సు! ఆ నీళ్లలోకి జంతువులు వెళ్తే రాయిలా మారుతాయట!

ఈ వింత, విచిత్రమైన సరస్సు ఉత్తర టాంజానియాలోని న్గోరోంగోరోలో ఉంది. ఇక్కడి స్థానిక ప్రజలు ఈ సరస్సును శాపగ్రస్తంగా భావిస్తారు. ఈ సరస్సు దెయ్యాలచే సృష్టించబడిందని వారు నమ్ముతారు. మనుషులు గానీ, జంతువులు గానీ ఈ సరస్సులోకి దిగితే.. వారు, అవి రాళ్ల మాదిరిగా మారిపోతారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఈ సరస్సును నాట్రాన్ లేక్ అని పిలుస్తారు. దీనిలో నీరు పూర్తిగా ఎర్రగా కనిపిస్తుంది. అందులో రక్తం ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సరస్సులోని నీటిని చూసి పర్యాటకులు భయపడతారు. సూర్యాస్తమయం తర్వాత ఎవరూ దాని ఒడ్డున తిరగడానికి సాహసించరు.

Dangerous Lake: భూమిపై అత్యంత ప్రమాదకరమైన సరస్సు! ఆ నీళ్లలోకి జంతువులు వెళ్తే రాయిలా మారుతాయట!
Most Dangerous Lake In The Earth
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 30, 2023 | 10:20 PM

Most Dangerous Lake on Earth: ఇప్పటికీ భూమిపై ఉన్న, సమాజానికి తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అలాంటి వాటి గురించి తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. అక్కడికి వెళ్లి ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు మరో లోకంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఈ రోజు మనం అలాంటి ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. మనం చెప్పుకోబోతున్నది ఒక సరస్సు గురించి. ఆ సరస్సులోకి మనుషులు గానీ, జంతువులు గానీ దిగితే రాళ్లుగా మారతారట.

ఈ సరస్సు ఎక్కడ ఉంది?

ఈ వింత, విచిత్రమైన సరస్సు ఉత్తర టాంజానియాలోని న్గోరోంగోరోలో ఉంది. ఇక్కడి స్థానిక ప్రజలు ఈ సరస్సును శాపగ్రస్తంగా భావిస్తారు. ఈ సరస్సు దెయ్యాలచే సృష్టించబడిందని వారు నమ్ముతారు. మనుషులు గానీ, జంతువులు గానీ ఈ సరస్సులోకి దిగితే.. వారు, అవి రాళ్ల మాదిరిగా మారిపోతారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఈ సరస్సును నాట్రాన్ లేక్ అని పిలుస్తారు. దీనిలో నీరు పూర్తిగా ఎర్రగా కనిపిస్తుంది. అందులో రక్తం ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ సరస్సులోని నీటిని చూసి పర్యాటకులు భయపడతారు. సూర్యాస్తమయం తర్వాత ఎవరూ దాని ఒడ్డున తిరగడానికి సాహసించరు.

ఈ సరస్సును ఎప్పుడు గుర్తించారు?

2013లో, ప్రముఖ వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ నిక్ బ్రాండ్ ఈ సరస్సు సమీపంలోని నాట్రాన్‌కి చేరుకున్నప్పుడు, అతను తన కళ్లను నమ్మలేకపోయాడు. ఈ సరస్సు మరొక ప్రపంచం నుండి వచ్చిన శక్తులచే సృష్టించబడినట్లుగా వారు భావించారు. ఈ ప్రదేశాన్ని ఫోటో తీసి నిక్ ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయగా, అది ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఆ తరువాత, ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు, శాస్త్రవేత్తలు ఈ సరస్సును చూసేందుకు సదరు స్థలానికి చేరుకోవడం మొదలుపెట్టారు.

సరస్సు ఎందుకు ప్రమాదకరమైనది?

ఈ సరస్సు అంత ప్రాణాంతకం అయ్యేది దాని నీరు కారణంగానే అని అంటున్నారు అక్కడి జనాలు. వాస్తవానికి, ఈ సరస్సు నీటి pH విలువ దాదాపు 12. అంటే, సింపుల్ గా చెప్పాలంటే, ఇది సరిగ్గా ఇంట్లో తయారుచేసిన బ్లీచింగ్ పౌడర్ లాంటిది. దీనితో పాటు ఈ సరస్సు నీటిలో సోడియం కార్బోనేట్, నైట్రోకార్బోనేట్ వంటి మూలకాలు కనిపిస్తాయి. ఇది ఈ సరస్సు నీటిని ప్రాణాంతకమైన ఉప్పగా చేస్తుంది. ఈ సరస్సులోకి వెళ్ళే ఏదైనా జంతువు చనిపోవడానికి, శరీరం ఆ సరస్సులో గడ్డకట్టడానికి కారణం ఇదే.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..