East Godavari: ‘గ్రేట్ డాక్టర్’.. ఒక చేతికి సెలైన్ ఎక్కుతూనే ఉంది.. మరో చేత్తో చికిత్స సాగుతూనే ఉంది

మనం రోజు పూజింజే ఆ దేవుడు చావుబ్రతుకుల్లో ఉన్నప్పుడు ప్రాణం పోస్తాడో, లేదో తెలియదు కానీ.. డాక్టర్ మాత్రం ప్రాణం నిలిపేందుకు...

East Godavari: 'గ్రేట్ డాక్టర్'.. ఒక చేతికి సెలైన్ ఎక్కుతూనే ఉంది.. మరో చేత్తో చికిత్స సాగుతూనే ఉంది
Doctor Treatment
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 01, 2021 | 3:59 PM

మనం రోజు పూజింజే ఆ దేవుడు చావుబ్రతుకుల్లో ఉన్నప్పుడు ప్రాణం పోస్తాడో, లేదో తెలియదు కానీ.. డాక్టర్ మాత్రం ప్రాణం నిలిపేందుకు మనసారా ప్రయత్నిస్తాడు. ఈ కరోనా వచ్చాక డాక్టర్లు, మెడికల్ సిబ్బంది సేవల విలువ ప్రపంచం మొత్తానికి తెలిసింది. అందుకే దేవుడికి నమస్కరించని నాస్తికులు కూడా డాక్టర్లకు చేతులెత్తి మొక్కారు. నిజం… వైద్యుల సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోనప్పుడు.. ప్రమాదకర వైరస్‌ సోకిన రోగిని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. కానీ డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి.. మరికొందరికి ప్రాణం పోశారు. ఇప్పుడు డాక్టర్ల గురించి ఇంతలా ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కెమెరా కంటపడింది. తన ఒంట్లో బాగాలేకపోయినా.. జబ్బున పడి వచ్చిన జనానికి మాత్రం మొండిచేయి చూపలేదు. ఒక చేతికి సెలైన్ ఎక్కుతుండగానే.. రోగులకు చికిత్స చేశారు. ఆ సందర్భంలో ఎవరో ఫోన్‌లో ఫోటో తీయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ డాక్టర్ పేరు సుందర్ ప్రసాద్‌. తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌పురం మండలం రేఖపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నారు.

అసలే గవర్నమెంట్ కొలువు. మాములుగానే సెలవలకు కొదవ ఉండదు. ఇక ఒంట్లో బాగలేకపోతే.. సిక్ లీవ్ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ డాక్టర్ మాత్రం వ్యాధి బారినపడి వచ్చినవారి పట్ల మానవత్వంతో వ్యవహరించి.. తనకు హెల్త్ సహకరించకపోయినా చికిత్స అందించారు. నెగిటివిటీ నిండిపోయిన ఈ రోజుల్లో కనిపించిన ఇలాంటి గుడ్ హార్ట్ ఉన్న డాక్టర్‌కు చేతులెత్తి మొక్కినా తప్పేముంది చెప్పిండి.

Also Read:  తాటి ముచ్చికతో మాస్క్.. బుడ్డోడు భలే షార్ప్

కన్న కొడుకును చంపేందుకు తండ్రి ప్లాన్.. ఎందుకో తెలిస్తే షాక్

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?