రెండేళ్ల క్రితం తప్పిపోయిన తమ కుక్కపిల్లను టీవీలో చూసి…ఆనందం పట్టలేకపోయిన కుటుంబం
అమెరికాలోని విస్కాన్ సిన్ లో జరిగిన విచిత్ర ఉదంతమిది.. రెండేళ్ల క్రితం తప్పిపోయిన తమ పెంపుడు కుక్కను టీవీలోని ఛానెల్ లో చూసి గుర్తు పట్టింది ఆ కుటుంబం.. అంతే ! వెంటనే వెళ్లి అది తమ కుక్కేనని నిర్ధారించుకున్నారు.
అమెరికాలోని విస్కాన్ సిన్ లో జరిగిన విచిత్ర ఉదంతమిది.. రెండేళ్ల క్రితం తప్పిపోయిన తమ పెంపుడు కుక్కను టీవీలోని ఛానెల్ లో చూసి గుర్తు పట్టింది ఆ కుటుంబం.. అంతే ! వెంటనే వెళ్లి అది తమ కుక్కేనని నిర్ధారించుకున్నారు. దాన్ని తమ ఇంటికి తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విస్కాన్ సిటీలో ద్వైట్ అనే వ్యక్తి, అతని ఫ్యామిలీ అత్యంత మురిపెంగా ఓ కుక్క[పిల్లను పెంచుకుంటూ వచ్చింది. దానికి ముద్దుగా ‘పేడే’ అని పేరు పెట్టి తమ పిల్లల్లాగే వారితో సమానంగా పెంచుకున్నారు. కానీ 2019 లో దాన్ని ద్వైట్ మార్కింగ్ వాక్ కి తీసుకువెళ్ళినప్పుడు అది తప్పి పోయింది. అప్పటి నుంచి దాని ఫోటోను తమకు తెలిసినవారికి, ఇతరులకు కూడా పంపి ఆచూకీ తెలపాల్సిందిగా వారు కోరారు. కానీ ఫలితం లేకపోయింది. అయితే ‘ఫాక్స్ 6’ అనే టీవీ ఛానల్ ఇటీవల తమ ప్రసారాల్లో ఈ కుక్కను చూపగా వీరు ఆశ్చర్యపోయారు. ఆనందాన్ని పట్టలేకపోయారు. అది ముమ్మాటికీ తమ పేడేయేనని గుర్తు పట్టి ఆ ఛానల్ కార్యాలయానికి వెళ్లారు.
తమ యజమానులను చూడగానే ఆ శునకం కూడా పరుగున వచ్చి వారిని ఆనందంలో ముంచెత్తింది. ద్వైట్ భార్య ఒడిలో చేరగానే ఆమె దానిపై ముద్దుల వర్షం కురిపించింది. రెండేళ్ల అనంతరం టీవీలో తమ శునకం కనబడుతుందని వారు ఏ మాత్రం ఊహించలేదు. అయితే ఇన్నేళ్లూ అది ఎక్కడ ఉంది.. ఎవరైనా పెంచుకున్నారా అన్న విషయం తెలియలేదు. ద్వైట్ , ఆయన భార్య మాత్రం సదరు టీవీ ఛానల్ వారికీ తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. పేడే తాలూకు వీడియోను చూసిన నెటిజన్లు కూడా మురిసిపోయి తమ ఆనందాన్ని ట్వీట్ల ద్వారా ఆ కుటుంబంతో పంచుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి : దొరుకుతవా దొర్కవా.. నేను దొర్కా పో..!చిరుతతో ‘కోతి’ కొమ్మచ్చి..వైరల్ వీడియో..:Cheetah vs Monkey Funny video.
ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.