తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ దళాల వైమానిక దాడులు..250 మంది తాలిబన్ల మృతి.. 100 మందికి పైగా గాయాలు
తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ దళాలు వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ ప్రావిన్స్ లోని జేరాయ్ జిల్లాలో మొదట తాలిబన్లు ఉంటున్న స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా..
తాలిబన్ల స్థావరాలపై ఆఫ్ఘన్ దళాలు వైమానిక దాడులతో విరుచుకపడ్డాయి. కాందహార్ ప్రావిన్స్ లోని జేరాయ్ జిల్లాలో మొదట తాలిబన్లు ఉంటున్న స్థావరాలపై వైమానిక దాడులు జరిపామని, ఆ తరువాత ఘజిని, కాందహార్, హెరాత్, హెల్మండ్, కపినా తదితర రాష్ట్రాల్లోని వీరి బేస్ లపై కూడా జరిపిన ఈ దాడుల్లో 250 మందికి పైగా తాలిబన్లు మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్ ప్రభుత్వం ట్వీట్ చేసింది. మా దాడుల్లో వందలాది మంది తాలిబన్లు మరణించడమో..గాయపడడమో జరిగిందని మొదట చేసిన ట్వీట్ లో పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరణ ప్రారంభం కావడంతో తాలిబన్లు వరుసగా దేశంలోని అనేక జిల్లాలను, గ్రామాలను తమ హస్తగతం చేసుకుంటూ వచ్చారు. కాందహార్ విమానాశ్రయంపై రాకెట్లు కూడా ప్రయోగించారు. అయితే ఇన్నాళ్లూ కేవలం వారిని వార్ జోన్ లో ఎదుర్కొన్న ఆఫ్ఘన్ బలగాలు ఏకంగా వైమానిక దాడులకు దిగడం విశేషం. తమ ఈ ఎటాక్ లో ధ్వంసమైన తాలిబన్ల స్థావరాల తాలూకు వీడియోను కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. గత 24 గంటల్లో తాము జరిపిన ఈ దాడుల్లో కచ్చితంగా ఎంతమంది మృతి చెందింది, ఎంతమంది గాయపడింది కూడా వివరించింది.
ఈ వైమానిక దాడులను ఏ మాత్రం ఊహించని తాలిబన్లు భారీగా నష్టపోయారని అంటున్నారు. త్వరలో తాము ఈ తరహా ఎటాక్ లకు పాల్పడుతామని ఆఫ్ఘన్ ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది. కాందహార్ ఎయిర్ పోర్టుపై వారు రాకెట్లను ప్రయోగించడంతో ఇక ఉపేక్షించరాదని ప్రభుత్వం భావించినట్టు కనబడుతోంది.కాగా తాలిబన్ల దాడుల్లో ఇద్దరు మహిళలతో సహా నలుగురు మరణించారు.
#Taliban terrorists hideouts were targeted by #AAF in Zherai district of #Kandahar province yesterday. Tens of #terrorists were killed and wounded as result of the #airstrike. pic.twitter.com/mM1uVyeXMu
— Ministry of Defense, Afghanistan (@MoDAfghanistan) August 1, 2021
మరిన్ని ఇక్కడ చూడండి : దొరుకుతవా దొర్కవా.. నేను దొర్కా పో..!చిరుతతో ‘కోతి’ కొమ్మచ్చి..వైరల్ వీడియో..:Cheetah vs Monkey Funny video.
ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.