Kitchen Cleaning Tips: కిచెన్ సింక్ మూసుకుపోయిందా ? నీళ్లు నిండిపోయి ఇబ్బందిపెడితే ఇలా చేయండి..

ఇలా జామ్‌ అయిన సింక్‌లను క్లీయర్‌ చేయటానికి కొందరు నానా తంటాలు పడుతుంటే.. మరికొందరు ప్లంబర్‌ని పిలిచి డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ, ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రతి ఇంట్లోను ఎదురయ్యే కిచెన్‌, సింక్‌ సమస్యను త్వరగా ఎలా పరిష్కరించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి..

Kitchen Cleaning Tips: కిచెన్ సింక్ మూసుకుపోయిందా ? నీళ్లు నిండిపోయి ఇబ్బందిపెడితే ఇలా చేయండి..
Kitchen Cleaning
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 08, 2024 | 5:21 PM

కిచెన్ సింక్ జామ్‌ అవటం అనేది చాలా సాధారణం. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయంలో ఈ సమస్య తప్పక ఎదురవుతుంది. అలాంటప్పుడు కిచెన్ సింక్‌లు, ఇంటి సింక్‌లను శుభ్రం చేయటం అందరికీ పెద్ద తలనొప్పిగా మారుతుంది. సింక్‌ కింద పేరుకుపోయిన మురికిని వదిలించాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. అయితే,ఇలా జామ్‌ అయిన సింక్‌లను క్లీయర్‌ చేయటానికి కొందరు నానా తంటాలు పడుతుంటే.. మరికొందరు ప్లంబర్‌ని పిలిచి డబ్బు ఖర్చు చేస్తుంటారు. కానీ, ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రతి ఇంట్లోను ఎదురయ్యే కిచెన్‌, సింక్‌ సమస్యను త్వరగా ఎలా పరిష్కరించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి..

వేడినీరు పోయాలి:

కిచెన్‌ సింక్‌ జామ్‌ అయినప్పుడు దానిని క్లీయర్‌ చేయటానికి మీరు వేడి నీటిని ఉపయోగించవచ్చు. వేడి నీరు చమురు, చెత్తను కరిగించి సింక్‌ పైప్‌లైన్‌ను క్లీయర్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బేకింగ్ సోడా, వెనిగర్:

బేకింగ్ సోడా, వెనిగర్ రెండింటీ మిశ్రమం జామైన సింక్‌లను క్లీయర్‌ చేయటంలో బెస్ట్‌గా పనిచేస్తాయి. ఇందుకోసం మొదట అర కప్పు బేకింగ్ సోడాను సింక్‌లో పోయాలి. దానిపై ఒక కప్పు వెనిగర్ పోయాలి. కాసేపు అలాగే ఉంచి తర్వాత వేడి నీటిని పోయాలి. ఇలా చేయటం వల్ల సింక్ పైపు లోపలి భాగాన్ని శుభ్రపరుస్తుంది.

ఉప్పు:

కిచెన్‌ సింక్‌లను శుభ్రపరచడంలో ఉప్పు కూడా సహాయపడుతుంది. దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అర కప్పు ఉప్పును సింక్‌పైప్‌లో పోసి దానిపై వేడి నీటిని పోసి వదిలివేయండి.

కూల్ డ్రింక్స్:

కోకా-కోలా, థమ్స్ అప్ వంటివి కూడా సింక్ వాష్ చేయాడానికి ఉపయోగించవచ్చు. ఇందులో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డ్రైన్‌వాటర్‌ పైప్‌లైన్‌ను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. కోకాకోలా డబ్బాను పూర్తిగా సింక్‌పైప్‌లైన్‌లో పోసి కాసేపు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత అందులోనే వేడి నీటిని కూడా కుమ్మరించాలి.

బ్లీచింగ్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ :

ఏదైనా మందుల దుకాణం నుండి బ్లీచింగ్ పౌడర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోండి. బక్కెట్‌ నీటిలో ఒక చిన్న బాటిల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 50-80 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలిపి సింక్‌లో పోయాలి. అలాగే, ఈ మిశ్రమం, వాటర్ ట్యాంక్ వాష్‌ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా వాటర్‌ ట్యాంక్‌ సగానికి ఎక్కువగా ఖాళీ చేసి, ఈ మిశ్రమాన్ని ట్యాంక్‌లో పోయాలి. ఆ తరువాత, మిశ్రమాన్ని 5 నిమిషాలు బాగా కలపాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న అన్ని కుళాయిలను ఓపెన్‌ చేసి ఉన్న నీటిని వదిలేయాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి..
సినీ ఇండస్ట్రీని దుల్లగొడుతున్న మీనాక్షి చౌదరి..
చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తింటే ఏమౌతుంది!
చలికాలంలో ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో స్పూన్ తేనె తింటే ఏమౌతుంది!
జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?
జబర్దస్త్ వినోద్ కుమారుడి ఉయ్యాల ఫంక్షన్.. ఫొటోస్ చూశారా?
మీ జీమెయిల్‌ అకౌంట్‌ను ఎవరైనా యూజ్‌ చేస్తున్నారని అనుమానంగా ఉందా.
మీ జీమెయిల్‌ అకౌంట్‌ను ఎవరైనా యూజ్‌ చేస్తున్నారని అనుమానంగా ఉందా.
మీకు 60 ఏళ్లు ఉన్నా 30 ఏళ్లలాగా కనిపించాలా? ఈ 4 అలవాట్లతో
మీకు 60 ఏళ్లు ఉన్నా 30 ఏళ్లలాగా కనిపించాలా? ఈ 4 అలవాట్లతో
పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
పెరిగిన దేశీయ విమానయాన ప్రయాణికులు.. అక్టోబర్‌లో వృద్ధి ఎంతంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌పై క్లారిటీ
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌‌పై క్లారిటీ
ఇన్‌స్టాలో మీ లైక్స్‌ కనిపించకూడదా.? ఈ సెట్టింగ్ మార్చేస్తే సరి..
ఇన్‌స్టాలో మీ లైక్స్‌ కనిపించకూడదా.? ఈ సెట్టింగ్ మార్చేస్తే సరి..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ.. ఏం చేసిందో తెలిస్తే..
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా
శుక్రయాన్-1 కు ఇస్రో రెడీ.. కేంద్రం ఆమోదం.. ప్రయోగం ఎందుకో తెలుసా