Job Astrology: శనీశ్వరుడి అనుకూలత.. ఉద్యోగ జీవితంలో ఆ రాశుల వారికి ఆశించిన మార్పులు పక్కా..!

ఉద్యోగం సంతృప్తికరంగా లేదా? మార్పు లేనందువల్ల స్తబ్ధత ఏర్పడిందా? ఇంతకన్నా మంచి ఉద్యోగంలోకి మారాలనుకుంటున్నారా? ఎదుగూ బొదుగూ ఉండడం లేదా? ఇటువంటి ప్రశ్నలు అడిగే వారిలో కొన్ని రాశుల వారికి మాత్రం ఆశించిన మార్పులకు అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు కుంభ రాశిలో ప్రస్తుతం వక్ర గమనంలో చురుకుగా ఉన్నందువల్ల ఈ రాశుల వారికి నవంబర్ 15 లోపు తప్పకుండా ఉద్యోగ వాతావరణం మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

Job Astrology: శనీశ్వరుడి అనుకూలత.. ఉద్యోగ జీవితంలో ఆ రాశుల వారికి ఆశించిన మార్పులు పక్కా..!
Job Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 08, 2024 | 5:07 PM

ఉద్యోగం సంతృప్తికరంగా లేదా? మార్పు లేనందువల్ల స్తబ్ధత ఏర్పడిందా? ఇంతకన్నా మంచి ఉద్యోగంలోకి మారాలనుకుంటున్నారా? ఎదుగూ బొదుగూ ఉండడం లేదా? ఇటువంటి ప్రశ్నలు అడిగే వారిలో కొన్ని రాశుల వారికి మాత్రం ఆశించిన మార్పులకు అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మేషం, వృషభం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఉద్యోగపరంగా అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగ కారకుడైన శనీశ్వరుడు కుంభ రాశిలో ప్రస్తుతం వక్ర గమనంలో చురుకుగా ఉన్నందువల్ల ఈ రాశుల వారికి నవంబర్ 15 లోపు తప్పకుండా ఉద్యోగ వాతావరణం మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

  1. మేషం: ఈ రాశికి ఉద్యోగ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో వక్రించడం వల్ల ఉద్యోగ జీవితంలో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరిగి, కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ముఖ్యంగా పర్యవేక్షణ బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. అధికారులు మీ పనితీరుకు సంతృప్తి చెంది, జీతభత్యాలు పెంచడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
  2. వృషభం: ఈ రాశివారికి దశమ స్థానాధిపతి శని దశమ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగ జీవి తంలో స్తబ్ధత తొలగిపోయే కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. శని స్వస్థానంలో వక్రించినందు వల్ల ఉద్యోగంలో రోజుకో శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. పని భారం నుంచి పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. బాధ్యతలు వేగంగా మారిపోతాయి. కొత్త బాధ్యతలు చేరుతుంటాయి. అధికారులకు మీ మీద బాగా నమ్మకం పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది.
  3. కన్య: ఉద్యోగ కారకుడైన శని ఆరవ స్థానంలో చురుకుగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో తప్పకుండా అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు అనేక ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. సరికొత్త ప్రాజెక్టులు అంది వస్తాయి. జీతభత్యాలు, హోదా, బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ జీవి తాన్ని ఒక సవాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
  4. తుల: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు పంచమ స్థానంలో వక్రించి బలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో మీ ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అధి కారులకు మీ మీద నమ్మకం బాగా పెరిగి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. జీత భత్యాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు కూడా వృద్ధి చెందు తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అనేక ఆఫర్లు, అవకాశాలు, ఆహ్వానాలు అందుతాయి.
  5. ధనుస్సు: ఈ రాశివారికి ఉద్యోగ కారకుడు శని తృతీయంలో వక్రించినందువల్ల ఉద్యోగంలో స్తబ్ధత ఏర్పడడం, బోరు కొట్టడం వంటివేవీ ఉండవు. పని చేస్తున్న సంస్థలో మీరొక కేంద్ర బిందువుగా మారే అవ కాశం ఉంటుంది. అధికారులు మీ సలహాలు, సూచనలు పాటించి లబ్ధి పొందుతారు. మీకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ జీవితం సరికొత్త బాధ్యతలతో రోజూ ఉత్సాహంగా సాగిపోతుంది. జీతభత్యాలు వృద్ధి చెందుతాయి.
  6. మకరం: ఈ రాశివారికి ఉద్యోగ కారకుడు శని ధన స్థానంలో వక్రించి ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో యాక్టివిటీ అత్యధికంగా ఉంటుంది. ఒక్క నిమిషం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా ఆదాయానికి లోటుండదు. ఉద్యోగం మారినా, మారకపోయినా ఈ పరిస్థితిలో మాత్రం తేడా ఉండకపోవచ్చు. అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. బాధ్యతలు మారిపోతూ ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయడం, కొత్తవారిని కలుసుకోవడం జరుగుతుంది.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో