Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 9, 2024): మేష రాశి వారికి ఉద్యోగం జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారు ఈ రోజు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతాయి. మిథున రాశి వారి ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (ఆగస్టు 9, 2024): మేష రాశి వారికి ఉద్యోగం జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారు ఈ రోజు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతాయి. మిథున రాశి వారి ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
అదనపు ఆదాయ ప్రయత్నాల కారణంగా శ్రమ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులు ఉంటాయి. ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలు సాను కూలపడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయవద్దు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
శుభ గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతాయి. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగంలో పనిభారం తగ్గుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యల్ని చాలావరకు తగ్గించుకుంటారు. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ముంది. ఆర్థిక పరిస్థితి మరింతగా అనుకూలంగా ఉంటుంది. అయితే, ఆదాయానికి మించి వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల వల్ల ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులున్నప్పటికీ కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయానికి లోటుండదు కానీ, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదు వులు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమలు హ్యాపీగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వృత్తి, వ్యాపారాల్లో రాబడికి ఏమాత్రం లోటుండకపోవచ్చు. ఉద్యోగ జీవితంలో మరింతగా అను కూలతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు ఒక పట్టాన ముందుకు సాగకపోవచ్చు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు ఉపక రిస్తాయి. కొందరు మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగు తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహా యం చేసే స్థితిలో ఉంటుంది. అనుకోకుండా మంచి అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. సోద రులతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయ కంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. కొత్త కార్యక్ర మాలు ప్రారంభించవచ్చు. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కదిద్దుతారు. వ్యక్తిగత సమ స్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో బాద్యతలు పెరిగే సూచనలున్నాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహా రాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అనుకున్న పనులన్నీ ఆశించిన విధంగా పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవ కాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగు తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కొత్త ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాల విషయంలో ఆశించిన శుభవార్తలు అందుతాయి. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎటువంటి ప్రయత్నమైనా బాగా కలిసి వస్తుంది. ఆదాయం బాగా పెరుగు తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందుల్ని అధిగమిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఏ ప్రయత్నం తలపెట్టినా, ఏ పని చేపట్టినా వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితం చికాకులతో సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీకు ప్రాధాన్యమిస్తారు. వ్యాపారాల్లో కొద్దిగా మాత్రమే లాభాలు పెరుగుతాయి. మిత్రుల కారణంగా కొద్దిగా డబ్బు నష్టపోవడం జరుగుతుంది. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులుంటాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. అధికారులకు మీ సామర్థ్యం మీద బాగా నమ్మకం ఏర్పడుతుంది. వృత్తి జీవితంలో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపో తాయి. కొద్ది ప్రయత్నంతో బాకీలు వసూలవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్ర చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త కార్య క్రమాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.