Gastritis Avoid Food: గ్యాస్, అజీర్ణ సమస్య ఉన్నవారు.. ఈ ఐదు ఫుడ్స్ అస్సలు తినకూడదు..!

మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్ల వల్ల నేడు ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. జంక్ ఫుడ్, ఆల్కహాల్ వినియోగం, స్వీట్ల వినియోగం, ఒత్తిడి వంటి వివిధ కారణాల వల్ల గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువగా వస్తుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ హెల్తీ డైట్ పాటించాలి. గ్యాస్ట్రిక్ సమస్యల నుండి బయటపడటానికి కొన్ని ఆహారాలు తప్పనిసరిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. తెలియకుండా కూడా అలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య పెరుగుతుంది. అయితే, గ్యాస్ట్రిటిస్‌ సమస్యతో ఇబ్బందిపడుతున్నవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Aug 08, 2024 | 3:51 PM

బంగాళదుంపలు: బంగాళదుంపలను అందరూ ఇష్టపడతారు. కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లయితే వీలైనంత వరకు బంగాళదుంపలకు దూరంగా ఉండటం మంచిది. బంగాళదుంపలలో పిండి పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను అడ్డుకుంటుంది. పప్పులతో ఉడకబెట్టిన బంగాళాదుంపతో గ్యాస్ట్రిక్ పెరుగుతుంది.

1 / 5
క్యాబేజీలో విటమిన్ కె, అయోడిన్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీ శరీరంలో మంటను తగ్గిస్తుంది. సల్ఫోరాఫేన్, కెంప్ఫెరోల్ వంటి యాంటీఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక మంట, దాని లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

2 / 5
పుచ్చకాయ: పుచ్చకాయలో నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ జ్యుసి పండు చాలాసేపు ప్రేగులలో ఉండిపోతుంది. ఇది జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ఇందులో షుగర్ మన్నిటాల్ ఉండటం వల్ల వాత సమస్య ఇబ్బంది పెడుతుంది.

3 / 5
దోసకాయ: దోసకాయలో నీరు, పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట తినడం కడుపుకు మంచిది కాదు. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. గ్యాస్ ఏర్పడుతుంది. రాత్రిపూట దోసకాయ తింటే కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది.

4 / 5
నిమ్మకాయ: నిమ్మకాయలు కూడా జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు దీనిని తినకూడదు. నిమ్మరసం కూడా తాగకూడదు.

5 / 5
Follow us