Murari: ట్రెండింగ్‌లో మురారి… ఈసారి ఇలా ప్లాన్ చేశారా ??
సూపర్‌స్టార్ బర్త్ డే వేడుకలంటే ఎలా ఉండాలో తెలుసా... ఇదిగో ఇలా ఉండాలి... అంటూ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. వరుసబెట్టి అప్‌డేట్‌లు వస్తున్నప్పుడు ట్రెండింగ్ చేయడంలో కిక్కేం ఉంటుంది. ఉన్న అప్‌డేట్‌నే నాన్‌స్టాప్‌గా ట్రెండ్ చేస్తే కదా కిక్కూ అని అంటున్నారు. ఇంతకీ మురారిని చూడటానికి మీరూ రెడీ అవుతున్నారా?
Updated on: Aug 08, 2024 | 3:21 PM

దీనికి ముందు బిజినెస్ మెన్ 5.25 కోట్లు ఉండేది. ఖుషీ 4.15 కోట్లు.. సింహాద్రి 4 కోట్లు మొదటి రోజు వసూలు చేసాయి. జల్సా 3.20 కోట్లు.. ఒక్కడు 2 కోట్ల వరకు మొదటి రోజు వసూలు చేసాయి.

నైజాంలో ఏకంగా 2.92 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసాడు మురారి. అలాగే మిగిలిన ఏరియాల్లోనూ మంచి వసూళ్లే వచ్చాయి. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర రీ రిలీజ్ చేస్తున్నారు.

మురారి ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా మురారి ఫస్ట్ డే 5.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగులో రీ రిలీజ్ సినిమాలకు ఇదే హైయ్యస్ట్.

అలా ఉంది మురారి రీ రిలీజ్‌కు మహేష్ బాబు అభిమానులు చేసిన రచ్చ. అసలు మురారి రీ రిలీజ్ ఏంటి.. ఈ సినిమా చేస్తే ఎవరు చూస్తారన్నారంతా. కానీ చాలా రోజుల తర్వాత రీ రిలీజ్‌కు ఉన్న రేంజ్ ఏంటో ఈ సినిమా మరోసారి చూపించింది.

మురారి కలెక్షన్లు చూసాక.. ఇంద్ర మోత మోగించడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా అప్పుడు సినిమాలేం లేవు. మొత్తానికి రీ రిలీజ్‌లకు మురారి ఊపిచ్చింది. మురారి ఫస్ట్ డే 5.45 కోట్ల గ్రాస్. బిజినెస్ మెన్ 5.25 కోట్లు. ఖుషీ 4.15 కోట్లు.. సింహాద్రి 4 కోట్లు గ్రాస్. జల్సా 3.20 కోట్లు.. ఒక్కడు 2 కోట్ల గ్రాస్. నైజాంలో 2.92 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మురారి రీ రిలీజ్.




