- Telugu News Photo Gallery Cinema photos Actress Mrunal Thakur Fires Getting Viral News About Her Old Comments On Virat Kohli
Mrunal Thakur: విరాట్ కోహ్లీ అంటే పిచ్చి ఇష్టం.. ఇక చాలా ఆపేయండి.. మృణాల్ ఠాకూర్ సీరియస్..
దక్షిణాది సినీ ప్రియులకు ఇష్టమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సీతామహాలక్ష్మీగా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. చివరగా విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన మృణాల్.. ప్రస్తుతం హిందీతోపాటు పలు వెబ్ సిరీస్ చేస్తుంది.
Updated on: Aug 08, 2024 | 3:09 PM

దక్షిణాది సినీ ప్రియులకు ఇష్టమైన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సీతామహాలక్ష్మీగా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

చివరగా విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించిన మృణాల్.. ప్రస్తుతం హిందీతోపాటు పలు వెబ్ సిరీస్ చేస్తుంది. అలాగే తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. అలాగే విరాట్ కోహ్లీ అంటే కూడా చాలా పిచ్చి అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అవే కామెంట్లను మరోసారి వైరల్ చేస్తున్నారు. దీనిపై మృణాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఎప్పుడో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు మళ్లీ ప్రచారం చేయొద్దని కోరింది. ఓ మీడియా పోర్టల్ తన ఇన్ స్టాలో మృణాల్ కు విరాట్ కోహ్లి అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తూ రాసుకొచ్చింది. దీనిపై స్పందించిన మృణాల్ ఆ పోస్ట్ కింద ఇక చాలు.. ఇకనైనా ఆపేయండి అంటూ కామెంట్ చేసింది.

గతంలో జెర్సీ సినిమా ప్రమోషన్లలో మృణాల్ మాట్లాడుతూ క్రికెట్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది. తన సోదరుడితోపాటు క్రికెట్ చూడడం అలవాటుగా మారిందని.. విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించిన రోజులున్నాయని.. అలాంటిది క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమాలో నటించడం సంతోషంగా ఉందని తెలిపింది.




