AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!

వర్షాకాలంలో మొక్కజొన్న పొత్తులు ఎక్కువగా లభిస్తాయి. వర్షాకాలం చల్లటి సాయంత్రం వేళ వేడి వేడి మొక్కజొన్న కంకులు తింటుంటే ఉంటుంది. ఆ మజానే వేరు. ఎవరో చెప్పినట్టుగా స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటాం..చెప్పాలంటే.. ఆ అనుభూతే వేరప్పా..ఈ మొక్కజొన్న కంకులు తినడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే, ఈ మొక్కజొన్నలు కేవలం టైమ్‌పాస్‌ స్నాక్‌ ఐటమో, లేదంటే, తినటానికి రుచిగా ఉంటాయనే కాదు.. ఆరోగ్యానికి కూడ చాల మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. మొక్కజొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Aug 08, 2024 | 4:23 PM

Share
మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. తద్వారా వ్యాధులను నివారిస్తుంది. మొక్కజొన్నలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఆకలి బాధలను తగ్గిస్తుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మొక్కజొన్నలో విటమిన్ ఎ, బి, ఇ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

1 / 5
మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా కండ్ల కలక కూడా బాధిస్తుంటుంది. అలాంటి వారికి మొక్కజొన్నలోని విటమిన్ ఎ, సి కంటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. కండ్ల కలక వంటి సమస్యల్ని దూరం చేస్తుంది.

2 / 5
వర్షపు నీటిలో యాసిడ్ నేచర్ ఉంటుంది. దీనివల్ల వర్షంలో తడిస్తే చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. అయితే కాల్చిన మొక్కజొన్న తినడం ద్వారా ఇందులోని విటమిన్ సి చర్మ వ్యాధులను నివారిస్తుంది. మొక్కజొన్నలో విటమిన్ బి1, బి5, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి. తద్వారా అనేక అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి.

3 / 5
వర్షంలో తడవడం వల్ల లేదా తేమ ఎక్కువగా ఉండటం వల్ల వానాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. అంటువంటి పరిస్థితుల్లో మొక్కజొన్నలోని పోషకాలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మొక్కజొన్న గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపర్చి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. గ్యాస్, ఎసిడిటీని దూరం చేస్తుంది.

4 / 5
మొక్కజొన్నలో కాపర్, ఐరన్‌తోపాటు మరిన్ని ఆవశ్యక ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా మార్చడంలో సహాయపడతాయి. మొక్కజొన్నలోని ఆవశ్యక పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించడంలో దోహదపడతాయి. రక్తహీనతతో బాధపడేవారు మొక్కజొన్న గింజలు తినడం మంచిది. వీటిలోని ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

5 / 5