- Telugu News Photo Gallery Women celebrating Friendship and valley school in Sarees in visakhapatnam Telugu News Photos
Visakhapatnam: తీరంలో తళుక్కుమన్న మగువలు.. చీరకట్టులో అలా అలా..! ఫొటోస్.
'చీరలోని గొప్పతనం తెలుసుకో.. చీర కట్టి ఆడతనం పెంచుకో.. సింగారమనే దారంతో చేసింది చీర.. ఆనందమనే రంగులనే అద్దింది చీర.. మమకారమనే మగ్గంపై నేసింది చీర..' అంటూ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాట చీరలోని అందం.. ఆ చీరతో ఆడపడుచు సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు. ఆ పాటకు అచ్చం సరిపోయేలా.. విశాఖ సాగర తీరం ఆదివారం ఉదయం ఒక్కసారిగా తళుక్కుమంది.
Updated on: Aug 08, 2024 | 6:48 PM

'చీరలోని గొప్పతనం తెలుసుకో.. చీర కట్టి ఆడతనం పెంచుకో.. సింగారమనే దారంతో చేసింది చీర.. ఆనందమనే రంగులనే అద్దింది చీర.. మమకారమనే మగ్గంపై నేసింది చీర..' అంటూ సినీ గేయ రచయిత చంద్రబోస్ రాసిన పాట చీరలోని అందం.. ఆ చీరతో ఆడపడుచు సౌందర్యాన్ని చక్కగా వర్ణించారు.

ఆ పాటకు అచ్చం సరిపోయేలా.. విశాఖ సాగర తీరం ఆదివారం ఉదయం ఒక్కసారిగా తళుక్కుమంది. సాంప్రదాయ చీరకట్టులో మహిళలు మెరిశారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ చీర కట్టులో అదరహో అనిపించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూనే అచ్చ తెలుగు ఆడపడుచులా చీరకట్టు గొప్పతనాన్ని చూపించారు. కార్యక్రమానికి హోం మంత్రి అనిత హాజరై.. శారీ వాక్ లో పాల్గొన్నారు.

సండే.. సాగర తీరం.. మరోవైపు స్నేహితుల దినోత్సవం.. ఆహ్లాదకరమైన ప్రకృతి సుందర ప్రాంతంలో చేనేత చీరనడక శారీ వాక్ అదరహో అనిపించింది. ఈ కాలంనాటి యువతులకు చీర కట్టు గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు.. మగ్గంపై నేసిన చేనేత వస్ర్తాలను ప్రోత్సహించడంతో పాటు నడక వల్ల కలిగే ఆరోగ్యం ప్రయోజనాలపై అవగాహన కలిగించే ఉద్దేశంతో బీచ్ రోడ్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల సంఖ్యలో మహిళలు చీర కట్టుకుని పాల్గొన్నారు.

ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్వంలో మన సంస్కృతిని పరిరక్షించుకుందాం.. మన వారసత్వాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో నిర్వహించిన కార్యక్రమానికి.. ముఖ్య అతిధిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. శారీ వాక్ ను ప్రారంభించి.. మహిళలతోపాటు శారీ వాక్ లో పాల్గొన్నారు.

చీరలో అమ్మతనం, కమ్మతనం: హోం మంత్రి - చీరకట్టు అనేది భారతీయ సాంప్రదాయమనీ.. చీరలో అమ్మతనం, కమ్మతనం ఉంటుందన్నారు హోం మంత్రి. చేనేత కార్మికులకు అండగా నిలబడదామనీ పిలుపునిచ్చిన హోం మంత్రి అనిత.. భావితరాలు ఈ సాంప్రదాయాన్ని కొనసాగీంచాలన్నారు.

మహిళలకు స్ఫూర్తినిచ్చే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించిన హోం మంత్రి.. చీర నేయడంలో చేనేత కార్మికుల కష్టం దాగి ఉందని అన్నారు. చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకుంటామని అన్నారు హోం మంత్రి అనిత.

చీరకట్టులో భారీగా మగువలు..: ఈ శారీ వాక్ లో విశాఖలోని మహిళలే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మగువలు, వివిధ రంగాలకు చెందిన మహిళా మణులు కూడా చీర కట్టు నడకలో పాల్గొని ఔరా అనిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా డ్యాన్స్, కోలాటాలు, ప్రత్యేక చీర కట్టు షో పోటీలు ఆకట్టుకున్నాయి.
