Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ కోసం షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టిస్తే.. తండ్రి జ్ఞాపకార్థం ముగ్గురు కుమారులు ఏం చేశారో తెలిస్తే..

95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించిన తండ్రి కోసం అతని ముగ్గురు కుమారులు కలిసి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి మొత్తం 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మహారాష్ట్ర నుంచి కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి తెప్పించారు. ఈ విషయమై శివప్ప కుమారుడు మాట్లాడుతూ.. మా నాన్న గురించి రాబోయే తరాలకు తెలిసేలా నాన్నగారి గుడి కట్టించుకున్నామన్నారు.

ప్రేమ కోసం షాజహాన్‌ తాజ్‌మహల్‌ కట్టిస్తే.. తండ్రి జ్ఞాపకార్థం ముగ్గురు కుమారులు ఏం చేశారో తెలిస్తే..
Temple For Father
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 08, 2024 | 3:18 PM

ప్రేమ కోసమే షాజహాన్ తాజ్ మహల్ కట్టడం చరిత్ర అయితే, అలా నాన్నపై ప్రేమ, గౌరవంతో ఇద్దరు కొడుకులు ఆ తండ్రి జ్ఞాపకార్థం గుడి కట్టారు. అవును ఆస్తి కోసం తల్లిదండ్రులను తరిమికొడుతున్న నేటి కాలంలో ఈ లోకం విడిచిపెట్టిన తండ్రి కోసం గుడికట్టి గుండెల్లోపెట్టి కొలుచుకుంటున్నారు. తండ్రి రూపంతో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి, సమాధికి పూజలు చేస్తున్నారు. అలాంటి అరుదైన దృశ్యం కర్ణాటక రాష్ట్రం ధార్వాడ తాలూకాలోని నుగ్గికేరి గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లా రామదుర్గ తాలూకాలోని చించనూర్ గ్రామానికి చెందిన శివప్ప మలకారికి ఆరుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. శివప్ప తనకున్న కొద్దిపాటి భూమిని కాలువ నిర్మాణానికి ఇచ్చేయాల్సి వచ్చింది. ఆ తరువాత స్వగామాన్ని విడిచి ధార్వాడకు చేరుకున్నాడు. జీవనోపాధి కోసం ఓ హోటల్‌ను ప్రారంభించాడు. గిరమిత్ శివప్ప పేరుతో ఏర్పాటు చేసిన హోటల్‌ కొద్ది కాలంలోనే బాగా అంత ఫేమస్ అయ్యింది. అలా సంపాదించిన దాంతో నుగ్గికేరి గ్రామంలో ఏడున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేశాడు.

ఇక, శివప్ప పెద్ద కుమారుడు సివిల్ ఇంజనీర్, అతని రెండవ కుమారుడు రాజకీయాల్లో చేరాడు. అతని మూడవ కుమారుడు వ్యవసాయంలో తండ్రికి అండగా ఉంటూ కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే శివప్ప ఆరోగ్యం క్షిణించింది. 2023లో మరణించాడు. తండ్రి కోరిక మేరకు పొలంలో అంత్యక్రియలు జరిపించారు. శివప్ప మృతి చెందడంతో తండ్రి కోరిక మేరకు తనకున్న ఏడున్నర ఎకరాల భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. మొదటి సంవత్సరం తర్వాత శాస్త్రోక్తంగా ఒక మందిరాన్ని నిర్మించి, అందులో తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించిన శివప్ప మలకారి కోసం అతని ముగ్గురు కుమారులు కలిసి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి మొత్తం 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. మహారాష్ట్ర నుంచి కాంస్య విగ్రహాన్ని తయారు చేయించి తెప్పించారు. ఈ విషయమై శివప్ప కుమారుడు మాట్లాడుతూ.. మా నాన్న గురించి రాబోయే తరాలకు తెలిసేలా నాన్నగారి గుడి కట్టించుకున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తమ్మీద.. బతికున్న తల్లిదండ్రులనే పట్టించుకోని కొడుకులున్న ఈ రోజుల్లో చనిపోయిన తండ్రిని మర్చిపోలేక దేవుడిగా భావించి గుడి కట్టి కొలుస్తున్న ఈ కుమారులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..