Dark Circles: డార్క్ సర్కిల్స్‌ని పర్మినెంట్‌గా ఎలా దూరం చేయాలనుకుంటున్నారా..? ఇలా ట్రై చేయండి..
నేటి మారుతున్న జీవనశైలి అలవాట్లు, రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, తక్కువ నీళ్లు తాగడం, హార్మోన్లలో మార్పులు, జన్యుపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. మీరు ఈ నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్‌ని ట్రై చేయవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కళ్ల కింద నల్లటి వలయాలు మీ అందమైన ముఖాన్ని నిర్జీవంగా చేస్తాయి. దీంతో మీరు అనారోగ్యంగా కనిపిస్తారు. కళ్ల కింద నల్లటి వలయాలు స్త్రీలకే కాదు పురుషులకు కూడా పెద్ద సమస్య. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. నేటి మారుతున్న జీవనశైలి అలవాట్లు, రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, తక్కువ నీళ్లు తాగడం, హార్మోన్లలో మార్పులు, జన్యుపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. మీరు ఈ నల్లటి వలయాలను వదిలించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్‌ని ట్రై చేయవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
పచ్చిపాలు..
పాలు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. నల్లటి వలయాలను తొలగించడానికి చల్లని పాలను ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక గిన్నెలో పాలలో దూదిని నానబెట్టండి. ఆ తర్వాత దూదిని కంటి నల్లటి వలయాలను కప్పి ఉంచాలి. కళ్లపై దూదిని సుమారు 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత మంచినీటితో కళ్లను కడగాలి. మీరు ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా ఉదయం, రాత్రి అనుసరిస్తే, మీరు త్వరలో ప్రభావాన్ని చూస్తారు.
బంగాళదుంపలు..
బంగాళాదుంపలు నల్లటి వలయాలను వదిలించుకోవడానికి ఉపయోగపడతాయి. దీని కోసం బంగాళాదుంప తొక్క, దాని రసం సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ రసాన్ని కాటన్‌తో ముఖానికి పట్టించాలి. 5 నుంచి 10 నిమిషాల పాటు ఆరిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయండి. మీరు కొన్ని రోజుల్లోనే మీ ముఖంలో తేడాను గమనిస్తారు.
టీ డికాక్షన్..
కళ్లకింద ఏర్పడ్డ నల్లటి వలయాలను వదిలించుకోవడానికి టీ టీ డికాక్షన్ కూడా ఉపయోగించవచ్చు. ఇందు కోసం మీరు టీ ఆకులను కాసేపు నీటిలో మరిగించాలి…ఆ తర్వాత చల్లబరుచుకుని.. ఆ డికాక్షన్‌ను మీ కళ్ల కింద అప్లై చేయండి. కాసేపు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోండి..
రోజ్ వాటర్..
రోజ్ వాటర్ కళ్ళకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. కాటన్ బాల్స్ సహాయంతో కళ్లు మూసుకుని కనురెప్పలపై రోజ్ వాటర్ అప్లై చేసి 10 నిమిషాల పాటు ఉంచండి. ఇది మీ కళ్ళను చల్లబరుస్తుంది.
కీర దోసకాయ.. దోసకాయను గుండ్రని ముక్కలుగా కట్ చేసుకోవాలి.. కళ్లు మూసుకుని ఆ ముక్కలను మీ కనురెప్పలపై పెట్టుకోండి..అలా 10 నుండి 15 నిమిషాల పాటు కళ్లు మూసుకోండి.. కీరదోసకాయలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ల మంటను తగ్గించడంలో, నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడతాయి. కీరదోస రసం కూడా కళ్లకు చాలా మంచిది. అది చర్మానికి మంచి టోనర్‌గా కూడా పనిచేస్తుంది. కీరదోస రసంలో దూది ముంచి కనురెప్పలపై పెట్టుకోవాలి. కొంచెం రసాన్ని కండ్ల కింద భాగంలో రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కండ్ల్లు అందంగా మారుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..