AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వరద ఉధృతి.. ఒక్కసారిగా నదిలో కూలిన వంతెన.. వీడియో చూశారా?

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మరో విధ్వంసకర ఘటన చోటు చేసుకుంది. కాళీ నది మీద ఉన్న ఓ వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం రాత్రివేళ కాకుండా తెల్లవారు జామున జరిగి ఉంటే భారీ నష్టం వాటిల్లి ఉండేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన పాతది కావడం వల్లే అది కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Watch: వరద ఉధృతి.. ఒక్కసారిగా నదిలో కూలిన వంతెన.. వీడియో చూశారా?
Bridge Collapse In Karnatak
Jyothi Gadda
|

Updated on: Aug 07, 2024 | 8:50 PM

Share

కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో మరో విధ్వంసకర ఘటన చోటు చేసుకుంది. కాళీ నది మీద ఉన్న ఓ వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. కార్వార్ మీదుగా వెళ్లే 66వ జాతీయ రహదారిపై కాళీ నదిపై నిర్మించిన వంతెన ఉన్నట్టుండి కూలిపోయింది. మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఓ ట్రక్కు వెళ్తుండగా బ్రిడ్జి అమాంతంగా కూలింది. ఫిల్లర్ పిల్లర్ల మధ్య వంతెన నాలుగు వైపుల నుంచి విరిగి నదిలో పడిపోయింది. దీనితో ట్రక్కు నదిలో పడిపోగా, డ్రైవర్‌ను మత్స్యకారులు రక్షించారు. అనంతరం ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

అయితే ఈ ప్రమాదం రాత్రివేళ కాకుండా తెల్లవారు జామున జరిగి ఉంటే భారీ నష్టం వాటిల్లి ఉండేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన పాతది కావడం వల్లే అది కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గోవా, కర్ణాటక మధ్య ఈ బ్రిడ్జ్ కీలక వారధిగా ఇన్నాళ్లు కొనసాగుతూ ఉంది.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఈ వంతెన ధ్వంసం కావడం వల్ల గోవా, కర్ణాటక జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో అదే నదిపై ఉన్న కొత్త వంతెనను ప్రారంభించి, ఆంక్షలతో వాహనాలను అనుమతించారు. గత కొన్ని రోజులుగా ఉత్తర కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?