AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

My Home Group: మై హోమ్‌ గ్రూప్‌నకు మూడు ప్రతిష్టాత్మక కేంద్ర అవార్డులు.. జూపల్లి రంజిత్ రావుకి అందజేసిన కిషన్ రెడ్డి

పారిశ్రామిక రంగంలో విశేష సేవలందిస్తున్న మై హోమ్‌ గ్రూప్‌న‌కు అరుదైన గౌరవం లభించింది.. నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటున్న మై హోమ్‌ గ్రూప్‌నకు కేంద్రం నుంచి మూడు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.

My Home Group: మై హోమ్‌ గ్రూప్‌నకు మూడు ప్రతిష్టాత్మక కేంద్ర అవార్డులు.. జూపల్లి రంజిత్ రావుకి అందజేసిన కిషన్ రెడ్డి
Jupally Ranjith Rao, My Home Industries MD receives 5 star rating award from Union Minister Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Aug 07, 2024 | 7:32 PM

Share

పారిశ్రామిక రంగంలో విశేష సేవలందిస్తున్న మై హోమ్‌ గ్రూప్‌న‌కు అరుదైన గౌరవం లభించింది.. నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటున్న మై హోమ్‌ గ్రూప్‌నకు కేంద్రం నుంచి మూడు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైనింగ్ కంపెనీలకు అందించే 5 స్టార్ రేటింగ్ అవార్డ్స్‌ ప్రదానోత్సవం ఢిల్లీ వేదికగా బుధవారం జరిగింది.. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ అవార్డులను మైనింగ్ కంపెనీల ప్రతినిధులకు ప్రదానం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 10 గనులకు 5 స్టార్ రేటింగ్ రాగా.. అందులో మై హోం గ్రూపునకు చెందిన 3 మైన్లకు ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కింది.. తెలంగాణలో చౌటుపల్లి మైన్ కి, మేళ్లచెరువు మైన్, ఏపీలోని శ్రీజయజ్యోతి మైన్‌కి 5 స్టార్ రేటింగ్ అవార్డులు దక్కాయి.. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా మై హోమ్ ఇండస్ట్రీస్ ఎండీ జూపల్లి రంజిత్ రావు..  శ్రీజయజ్యోతి సిమెంట్స్‌, మేళ్లచెరువు, చౌటుపల్లిలోని మైహోం గనులకు మూడు 5 స్టార్ రేటింగ్ అవార్డులను అందుకున్నారు.

గనుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ దేశవ్యాప్తంగా ఉన్న గనులు.. వాటి సామర్థ్యాలను అంచనా వేసి.. 5-స్టార్ రేటింగ్ కేటాయిస్తుంది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రాథమిక లక్ష్యం దేశంలోని ఖనిజ వనరులను (ఆన్‌షోర్ – ఆఫ్‌షోర్ ) క్రమబద్ధంగా, శాస్త్రీయంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. గనుల సామర్థ్యం. నాణ్యత, వసతులు, భద్రతా, సిబ్బంది రక్షణ.. తదితర అంచనాలతో ఈ అవార్డులను ప్రధానం చేస్తుంది. దీనిలో భాగంగా 2022-23 సంవత్సరానికి గాను.. గనుల పనితీరును అంచనా వేసి దేశవ్యాప్తంగా ఉన్న 68 గనులకు 5స్టార్ రేటింగ్ ఇచ్చింది.. వీటిలో మై హోమ్ గ్రూప్ పరిధిలోని మూడు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కింది..

ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మైనింగ్ ద్వారా దేశ అభివృద్ధి జరుగుతుందన్నారు. కాగా.. 5స్టార్ రేటింగ్ సాధించిన 68 మైన్స్ లో మూడు మై హోమ్ గ్రూప్ నకు లభించడం పట్ల పారిశ్రామిక రంగంలోని పలువురు ప్రముఖులు.. మై మోమ్ ఇండస్ట్రీస్ కు అభినందనలు తెలియజేశారు..

వీడియో చూడండి..

తెలుగు రాష్ట్రాల నుంచి అవార్డులు దక్కించుకున్న మైన్స్ ఇవే..

ఆంధ్రప్రదేశ్ నుంచి 5 (అన్నీ లైమ్ స్టోన్ మైన్స్)

  • భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్ – కడప
  • JSW సిమెంట్స్ లైమ్ స్టోన్ – నంద్యాల
  • దాల్మియా సిమెంట్స్ నవాబ్‌పేట – తలమంచిపట్నం.
  • అల్ట్రాటెక్ -తుమ్మల పెంట
  • శ్రీ జయజ్యోతి (మై హోం గ్రూప్) సిమెంట్స్ -కర్నూల్

తెలంగాణ నుంచి 5 (అన్నీ లైమ్ స్టోన్ మైన్స్)

  • మై హోం గ్రూప్ – చౌటుపల్లి-1
  • TSMDC – దేవాపూర్ (మంచిర్యాల)
  • మై హోం గ్రూప్ – మెళ్లచెరువు
  • రైన్ సిమెంట్స్ – నల్గొండ
  • సాగర్ సిమెంట్స్ నల్గొండ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..