చాణక్య నీతి : పిల్లల ఈ అలవాట్లను మాన్పించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారం..

చాణక్య నీతి : పిల్లల మొదటి గురువులు తల్లిదండ్రులు. వారి అభ్యాసం ఇంటి నుంచే మొదలవుతుందని ఉపాధ్యాయులు

చాణక్య నీతి : పిల్లల ఈ అలవాట్లను మాన్పించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారం..
Chanakya Niti
Follow us
uppula Raju

|

Updated on: Jul 13, 2021 | 11:31 AM

చాణక్య నీతి : పిల్లల మొదటి గురువులు తల్లిదండ్రులు. వారి అభ్యాసం ఇంటి నుంచే మొదలవుతుందని ఉపాధ్యాయులు చెబుతారు. అందుకే పిల్లలు చేసే ప్రతి పనులను తల్లిదండ్రులు బాధ్యతతో గమనిస్తూ ఉండాలి. వారి చేసే మంచి చెడులపై నిఘా ఉంచాలి. మంచిని ప్రోత్సహించి చెడు అలవాట్లను దూరం చేసేలా వారి పెంపకం ఉండాలి. కానీ చాలా సార్లు తల్లిదండ్రులు చిన్న వయసులోనే పిల్లలని వదిలేస్తారు. దీంతో వారు చెడు అలవాట్లకు బానిసై పెద్దయిన తర్వాత తలకు మించిన భారంగా మారుతారు. ఆచార్య చాణక్య కూడా తన చాణక్య నీతిలో పిల్లలకు సంబంధించి రెండు అలవాట్లను ప్రస్తావించారు. ఆ అలవాట్ల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

1. అబద్ధం అలవాటు చాణక్య నీతి ప్రకారం పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులకు అబద్ధం చెబుతారు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమతో దగ్గరకు తీసుకొని అబద్ధం చెప్పడాన్ని నిషేధించాలి. ఇది సకాలంలో చేయకపోతే అది పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుంది. అతన్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది.

2. పిల్లలు విననప్పుడు కొందరు పిల్లలు మొండి పట్టుదలగలవారు ఉంటారు. వారు తల్లిదండ్రుల మాట వినరు. అలాంటి పిల్లలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు. వారికి సరైన తప్పు, ఒప్పు మధ్య తేడా తెలియదు. ఇలాంటి మొండి అలవాటును తల్లిదండ్రులు మొగ్గలోనే తుంచివేయాలి. దీని కోసం ప్రేమతో సరైన విధానంలో వారికి వివరించాలి.

3. గొప్ప మనుషుల కథలు చెప్పండి చాణక్య ప్రకారం పిల్లలకు చిన్నప్పటి నుంచి గొప్ప పురుషుల కథలు చెప్పాలి. ఇది పిల్లలకు ప్రేరణనిస్తుంది. మంచి ఆలోచనలు వృద్ధి చెందుతాయి. అటువంటి పరిస్థితిలో వారిలాగే ఉండాలనే కోరిక పిల్లల మనస్సులో అభివృద్ధి చెందుతుంది. గొప్ప పురుషులు పిల్లలకు రోల్ మోడల్స్ అయితే వారి భవిష్యత్తు కూడా మెరుగ్గా ఉంటుంది.

4. ప్రేమతో వివరించండి కొట్టడం వల్ల పిల్లలు మొండిగా తయారవుతారు. అందుకే తల్లిదండ్రులు ఏ విషయమైనా ప్రేమతో చెప్పాలి. అయితే ఐదేళ్ల తరువాత పిల్లలు కొంచెం కఠినంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ తల్లిదండ్రులు వారిపై ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని ఆచార్య చాణక్య వివరించారు. ఎందుకంటే వారు ఇంకా మొండిగా తయారవుతారని వారి అభిప్రాయం.

EPFO : రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎంతకాలం వస్తుంది..! జాబ్ మానేసి చాలాకాలం అయితే ఏం చేయాలి..

Mahabubnagar : బైక్‌పై వెళుతున్న యువకుడిపై విరిగిపడిన భారీ వృక్షం.. యువకుడికి గాయాలు..

Corona Virus: ఈరోజు దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు. దాదాపు 118 రోజుల తర్వాత 31,443 కేసులు నమోదు