Mahabubnagar : బైక్‌పై వెళుతున్న యువకుడిపై విరిగిపడిన భారీ వృక్షం.. యువకుడికి గాయాలు..

Mahabubnagar : వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి కన్నెర్ర జేస్తుంది. జడి వానలు కురవడం వల్ల పిడుగులు పడి ప్రాణ నష్టం,

Mahabubnagar : బైక్‌పై వెళుతున్న యువకుడిపై విరిగిపడిన భారీ వృక్షం.. యువకుడికి గాయాలు..
Tree On Bike
Follow us
uppula Raju

|

Updated on: Jul 13, 2021 | 10:45 AM

Mahabubnagar : వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రకృతి కన్నెర్ర జేస్తుంది. జడి వానలు కురవడం వల్ల పిడుగులు పడి ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరుగుతుంటాయి. అంతేకాకుండా బలమైన గాలులు వీయడం వల్ల పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేలరాలుతాయి. అయితే ఇటువంటి సమయంలో రోడ్ల పక్కన ఉన్న చెట్లతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఏ సమయంలో విరిగిపడుతాయో తెలియకుండా ఉంటుంది. తాజాగా మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఓ చెట్టు విరిగి బైక్‌పై వెళుతున్న సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

భారీ వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలో ని క్లాక్ టవర్ వద్ద ఓ భారీ వృక్షం నేలకొరిగింది. రాత్రి పదకొండు గంటల సమయంలో బైకుపై వెళుతున్న యువకుడిపై పడింది. బైకు నుజ్జునుజ్జు అయింది కానీ అదృష్ట వశాత్తు యువకుడు గాయాలతో బయటపడ్టాడు. భారీ వృక్షంతో పాటు విద్యత్ వైర్లు కూడా తెగిపడ్డాయి. అంతేకాదు భారీ వర్షానికి పట్టణం లోని రామయ్య బౌలీ వద్ద కూడా మరో వృక్షం నేలకొరిగింది. దీంతో భారీ గా ట్రాఫిక్ జమ్ అయింది. ఇలాంటి ప్రకృతి‌ వైపరిత్యాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి సహాయక‌ చర్యలు‌ చేపట్టే ప్రత్యేక బృందాలను ఏర్పాటు‌ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. పిడుగు పాటు కార‌ణంగా దేశంలో ఏటా దాదాపు 2వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మూగ జీవాలు కూడా చ‌నిపోతున్నాయి. పిడుగులు ఎప్పుడు, ఎక్కడ ప‌డ‌తాయో ముందే అంచ‌నా వేయ‌డంతో పాటు, ప్రజ‌లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని చాలా వ‌ర‌కు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏటా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ పిడుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్రకృతి విపత్తుల నష్టం కింద ప్రభుత్వం 4 లక్షల పరిహారం అందిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఇదే తరహా పరిహారం అమలవుతోంది.

NEET Exam 2021: నీట్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి..

Chris Gayle : క్రిస్‌గేల్ మరో చరిత్ర..! టి 20 లో 14000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్..

Covid third Wave: అప్పుడే మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. IMA వార్నింగ్..