AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid third Wave: అప్పుడే మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. IMA వార్నింగ్..

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదాలను మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. మనకు తెలీకుండానే మనం వైరస్‌కు స్వాగతం పలుకుతున్నామా.. థర్డ్ వేవ్ ముప్పుపై...

Covid third Wave: అప్పుడే మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. IMA వార్నింగ్..
Covid Third Wave
Sanjay Kasula
|

Updated on: Jul 13, 2021 | 11:29 AM

Share

కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ మిగిల్చిన విషాదాలను మర్చిపోయారా.. మూడో ముప్పు రావాలని కోరుకుంటున్నారా.. మనకు తెలీకుండానే మనం వైరస్‌కు స్వాగతం పలుకుతున్నామా.. థర్డ్ వేవ్ ముప్పుపై ఇండియన్ మెడికల్ (IMA) అసోసియేషన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంత జరిగినా అసలు భయం ఉందా..? కొంచెమైనా మీకు జాగ్రత్త ఉందా..? ఎక్కడ చూసినా విచ్చలవిడిగా జలకాలాటలు.. ఒక్కరికీ మాస్క్‌లేద.. బౌతిక దూరం అనే మాటనే మర్చిపోయారు. కోవిడ్-19 ప్రొటోకాల్ విషయంలో అలక్ష్యం తగదని హెచ్చరించారు. వివిధ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కిక్కిరిసిన రద్దీపై ఆందోళన వ్యక్తం చేసింది.

ఫస్ట్ వేవ్ అంటే తెలీకుండా వచ్చింది. మన నిర్లక్ష్యం.. ముందు జాగ్రత్త లేకపోవడం సెకండ్ వేవ్‌కు కారణమైంది. ఇక మూడో సారి కరోనా దాడి చేసిందంటే.. ఎవరిది బాధ్యత. మొదటి, రెండో దశలో ఏం గుణ పాఠాలు నేర్చుకున్నాం. గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. మే 15 నుంచి జూన్‌ 20 వరకు దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు సడలిస్తున్నారు.

మన రాష్ట్రంలోనూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే కేసుల సంఖ్య మన రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నా… దేశంలోని కేరళ, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మూడో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటిచడం, చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మర్చిపోకూడదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ పనుల మీద బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం ద్వారా కరోనా వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ప్రజలు రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ సమయంలోనే కరోనా వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మర్చిపోతున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో మనవంతు బాధ్యతను నిర్వర్తిద్దాం.. కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం. కరోనాతో జరిగే యుద్ధంలో విజయం సాధిద్దాం

మాస్క్ తప్పనిసరిగా ధరించాలి?

కోవిడ్-19 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినపుడు గానీ, దగ్గినపుడు గానీ ద్రవరూపంలో ఉండే తుంపర్లు గాలి ద్వారా ఎదుటివారి మీద పడే అవకాశం ఉంటుంది. మరికొందరిలో శ్వాసకోస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అదే మనం మాస్కు ధరిస్తే వైరస్ మన శ్వాసవ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

ఎప్పటిలాగే తీవ్రమైన రద్దీ…

టిఫిన్, టీ, ఫ్రూట్ జ్యూస్ సెంటర్ల దగ్గర ఎప్పటిలాగే తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఎక్కడా కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పెట్టుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఫ్యాషన్ గా మాస్కులు ముఖానికి తగిలించుకుని నిర్లక్ష్యంగా ఉంటున్నారు.

ఎవరూ అతీతులు కాదు..

కరోనాకి ఎవరూ అతీతులు కాదు. రాబోయే రోజుల్లో కరోనా బారినపడేవారి సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మనవరకు రాలేదని, ఒకవేళ కరోనా వచ్చిపోయినా అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు. అది మన బాధ్యతారాహిత్యాన్ని తెలియచేస్తుంది.

ముందస్తు జాగ్రత్తలు పాటించాలి..

కరోనా అనేది సాధారణ వ్యాధుల్లా పరిగణించి బయట తిరగకూడదు. ఉద్యోగ రీత్యా, ఇతర పనుల కోసం బయటకు వెళ్లినా కరోనా సోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు పెట్టుకోవాలి.

మీ పిల్లలను…

సాధ్యమైనంత వరకు చిన్న పిల్లల్ని బజారుకి, మార్కెట్లకు, రద్దీగా ఉండే ప్రదేశాలకు పంపకండని వైద్యులు హెచ్చరించారు. కరోనా నిబంధనలను తప్పని సరిగా పాటించాలని కోరుతూ కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు.

ఇవి కూడా చదవండి : Gupta Nidhulu: నిర్మల్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా..

Free Condoms: ఐదో తరగతి ఆపై విద్యార్థులకు కండోమ్స్‌ తప్పనిసరి.. సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్. ఎక్కడో తెలుసా?

,