Scientist Sowmya Swaminathan: డేంజర్ సుమా ! బీ అలెర్ట్ ! వేర్వేరు వ్యాక్సిన్ల మిక్సింగ్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక..
వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేయడం (కలపడం), లేదా మ్యాచింగ్ చేయడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనివల్ల ఆరోగ్యంపై ఇది చూపే ప్రభావానికి సంబంధించి డేటా ఏదీ లేదని ఈ సంస్థ డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఇలాంటి డేటా ఇప్పటివరకు అందుబాటులో లేదని ఆమె చెప్పారు.
వేర్వేరు వ్యాక్సిన్లను మిక్స్ చేయడం (కలపడం), లేదా మ్యాచింగ్ చేయడం ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. దీనివల్ల ఆరోగ్యంపై ఇది చూపే ప్రభావానికి సంబంధించి డేటా ఏదీ లేదని ఈ సంస్థ డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. ఇలాంటి డేటా ఇప్పటివరకు అందుబాటులో లేదని ఆమె చెప్పారు. ఎప్పుడు, ఎవరు రెండు, మూడు లేదా నాలుగో డోసు వ్యాక్సిన్ తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటే అలాంటి దేశాలు ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.ఇప్పటికే దీనిపై అయోమయం నెలకొందన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నవారు ఫైజర్ లేదా మోడెర్నా టీకామందు తీసుకోవచ్చా అన్న విషయమై నిపుణులు ఇంకా రీసెర్చ్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఏప్రిల్ లో తను జాన్సన్ అండ్ జాన్సన్ టీకామందును, ఆ తరువాత జూన్ లో ఫైజర్ తీసుకున్నానని.. డా.ఏంజెలా రాస్ముసేన్ అనే నిపుణురాలు పేర్కొన్నారని, కానీ వ్యాక్సినేషన్ రూట్లు తక్కువగా ఉన్న దేశాలలోని ప్రజలు ఈ విధమైన వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకుంటే కలిగే ఫలితాల గురించి మొదట డాక్టర్లను అడిగి తెలుసుకోవాలని ట్వీట్ చేశారని సౌమ్యా స్వామినాథన్ వెల్లడించారు. ఒక నిపుణురాలే ఈ విధమైన సందేహాన్ని వ్యక్తం చేయడం గమనించాలన్నారు.
మేము ప్రస్తుతం ఓ డోసు టీకామందు తీసుకున్నాం..రెండో డోసు ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి అని చాలామంది మమ్మల్ని ప్రశిస్తున్నారు.. దానిపై వారికి తగిన సమాధానం ఇస్తున్నాం.. కానీ వేర్వేరు టీకామందులను మిక్స్ చేస్తే కలిగే ఫలితాల గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. అయినా ఇదే డేంజరస్ ట్రెండ్ అని భావిస్తున్నాం అని ఆమె వివరించారు. ఇక ధనిక దేశాలు తమవద్ద అదనంగా ఉన్న వ్యాక్సిన్లను పేద దేశాలకు ఇచ్చి వాటిని ఆదుకోవాలని ఆమె కోరారు.
మరిన్ని ఇక్కడ చూడండి : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021