US Heatwave: నిప్పుల కొలిమిలా కాలిఫోర్నియా.. వేడి గాలులు, వడగాడ్పులతో అమెరికా సతమతం..
US Heatwave: పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా విలవిలలాడుతోంది. ఎన్నడూ లేని వాతావరణ మార్పులతో సతమతమవుతోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా 'డెత్ వ్యాలీ' ఈ భూగ్రహం లోని 'అగ్ని గుండం' గా మారింది. ఈ వ్యాలీ నడిబొడ్డున గల ఫర్నేస్ క్రీక్ విజిటర్స్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన థర్మామీటర్ ..
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా విలవిలలాడుతోంది. ఎన్నడూ లేని వాతావరణ మార్పులతో సతమతమవుతోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా నిప్పుల కొలిమిలా మారింది. అక్కడి ‘డెత్ వ్యాలీ’ ఈ భూగ్రహంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలతో ‘అగ్ని గుండం’ గా మారింది. ఈ వ్యాలీ నడిబొడ్డున గల ఫర్నేస్ క్రీక్ విజిటర్స్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన థర్మామీటర్ .. నిన్న 54 డిగ్రీల సెల్సియస్ ను రికార్డు చేసింది. సాధారణంగా 35 లేదా 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతనే అమెరికన్లు భరించలేరు. అలాంటిది 54 డిగ్రీలంటే మామూలు మాట కాదు.వరుసగా మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. అనేక చోట్ల ఈ నెల 10 న 130 డిగ్రీల ఫారెన్ హీట్, 11 న 129.4 డిగ్రీల ఫారెన్ హీట్ నమోదవుతూ వచ్చింది. కాలిఫోర్నియాలో కొందరు టూరిస్టులు తమ ఏసీ కార్ల నుంచి దిగి డెత్ వ్యాలీలోని ఫర్నేస్ క్రీక్ విజిటర్స్ సెంటర్ దగ్గరున్న ధర్మామీటర్ దగ్గర సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారట. దాదాపు 10 మైళ్ళ దూరం వరకు తన బైక్ ని నడుపుకుంటూ వచ్చిన ఓ బైకర్..మిట్ట మధ్యాహ్న సమయంలో టెంపరేచర్ 178 డిగ్రీల వరకు ఉండవచ్చునని అంచనా వేశాడు. కొందరు టూరిస్టుల ‘అత్యుత్సాహాన్ని’ తాను చూశానన్నాడు.
వృద్దులు, చిన్న పిల్లలు బయట కాలు పెట్టకపోవడమే మంచిదని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. ఈ వేడిమికి బయటి వస్తే వడగాడ్పులకు గురై లేనిపోని వ్యాధులు తెచ్చుకుంటారని వార్నింగ్ ఇచ్చింది. దీనికి తోడు అడవుల కార్చిచ్చు కూడా తోడవుతోంది. పట్టణాల్లోని ఇళ్ళు సైతం దగ్ధమవుతున్నాయి. సదర్న్ ఓరెగాన్ ప్రాంతంలో కార్చిచ్చు కారణంగా సుమారు 1200 ఇళ్ళు దగ్ధమయ్యాయి. పెద్ద సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత జూన్ నెలలోనే అమెరికా ఎండలతో మండగా ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021