Manda Krishna – Katti Mahesh death: రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందిన కత్తి మహేష్ మరణంపై ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణమాదిగ సంచలన ఆరోపణలు చేశారు. కత్తి మహేష్ మరణం పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కారులో ముందు కూర్చున్న కత్తి మహేష్ చనిపోగా.. పక్క నే ఉన్న వ్యక్తికి చిన్న గాయం లేకుండా ఎలా బతికారని మంద ప్రశ్నించారు. కత్తి మహేష్ కు అనేక మంది శత్రువులున్నారని చెప్పిన ఆయన, కారు కూడా కత్తిమహేష్ కూర్చున్న వైపే డ్యామేజ్ కావడం అనుమానాలకి తావిస్తోందన్నారు.
Manda Krishna
మొదట కత్తి మహేష్ కు అసలు గాయలే లేవన్నారు. కత్తిమహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో అతని గురించి దారుణంగా కామెంట్స్ చేశారని మందకృష్ణ చెప్పుకొచ్చారు. కత్తిమహేష్ అంత్యక్రియలకి హాజరైన అనంతరం మందకృష్ణ చిత్తూరు జిల్లా యల్లమందలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Manda Krishna On Katti Mahe
“కత్తి మహేష్ మరణంపై నిజాయితీగల ఉన్నతాధికారులు, లేదంటే సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి. రెండు.. 15 రోజులు జరిగిన ట్రీట్‌మెంట్ ఏంటన్నది ఆస్పత్రుల నుంచి బయటకు రావాలి. ఇక ప్రమాదం జరిగిందా.. మరణం వెనుక మిస్టరీ ఉందాన్నది నిగ్గుతేలాలి.” అని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.
Read also: Koushik Reddy: ‘ఒకే ఫోన్ కాల్’.. హుజురాబాద్‌తో పాటు తెలంగాణ రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపింది