Tomato Price: టమాటా రేటు మళ్లీ ఢమాల్‌.. గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పారబోసి రైతులు

టమాటా రేటు మళ్లీ ఢమాల్‌మంది. బయట మార్కెట్లో కిలో 20వరకూ ఉంది గానీ.. రైతుకు వస్తోంది మాత్రం జస్ట్ 2 రూపీస్‌. చివరికి పెట్టిన పెట్టుబడే తిరిగొచ్చే దిక్కులేకుండా పోయింది.

Tomato Price: టమాటా రేటు మళ్లీ ఢమాల్‌.. గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పారబోసి రైతులు
Tomato
Follow us

|

Updated on: Jul 13, 2021 | 10:03 AM

టమాటా రేటు మళ్లీ ఢమాల్‌మంది. బయట మార్కెట్లో కిలో 20వరకూ ఉంది గానీ.. రైతుకు వస్తోంది మాత్రం జస్ట్ 2 రూపీస్‌. చివరికి పెట్టిన పెట్టుబడే తిరిగొచ్చే దిక్కులేకుండా పోయింది. చిత్తూరు జిల్లాలో టమోటా ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కుప్పం, శాంతిపురం మార్కెట్‌లో కిలో ధర దారుణంగా పడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆగ్రహించిన రైతులు – టమోటాలు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధర ఇస్తామని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెబుతున్నా… ఆచరణలో అది కనిపించడంలేదని ఆందోళన చెందుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.

టమోటా ధరల పతనంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. కృత్రిమ ధరలు సృష్టించి వినియోగదారులకు ఎక్కువ రేట్‌కు అమ్ముకుంటున్నారని రైతులు విమర్శిస్తున్నారు. కనీసం… రవాణా ఛార్జీలు కూడా గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. మార్కెట్‌కు వచ్చాక ఇంటికెళ్లాలంటూ కూడా డబ్బులుండటం లేదని చెబుతున్నారు. బస్సు చార్జీల కోసం ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుంటున్నామని తెలిపారు. రైతుకు – కొనుగోలుదారుకు మధ్య వ్యత్యాసాన్ని సృష్టించి వ్యాపారులు లాభపడుతున్నారని చెబుతున్నారు. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంతో తాము నష్టపోతున్నామన్నారు.

రైతులు చెబుతున్న దాంట్లో నిజం ఉంది. కుప్పం మార్కెట్‌లో కిలో టమోటాలు రూ. 3 లకు దిగువన పలకగా… అదే హైదరాబాద్, తిరుపతి మార్కెట్‌లో మాత్రం 8 నుంచి 10 రూపాయలకు అమ్ముతున్నారు. మరికొన్నిచోట్ల అంతకన్నా ఎక్కువకే అమ్ముతున్నారు. ఇదెక్కడి న్యాయమని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంమీద – రైతుల నోట్లో మన్నుకొడుతున్న వ్యాపారస్తులు… వినియోగదారుల నుంచి మాత్రం ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారు. దీనిపై అధికార యంత్రాంగం తప్పకుండా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి : Gupta Nidhulu: నిర్మల్‌ జిల్లాలో గుప్తనిధుల కలకలం.. కన్నం వేసేందుకు కన్నింగ్‌ ఫెల్లో ప్లాన్.. ఏమైందో తెలుసా..

Free Condoms: ఐదో తరగతి ఆపై విద్యార్థులకు కండోమ్స్‌ తప్పనిసరి.. సంచలన నిర్ణయం తీసుకున్న పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్. ఎక్కడో తెలుసా?