AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9: టీవీ9 కథనాల ఫలితం.. అలిపిరిలో కిడ్నాప్‌కు గురైన బాలుడు క్షేమంగా ఇంటికొచ్చిన వైనం.!

శివ ప్రసాద్‌ అలియాస్‌ శివారెడ్డి. పిల్లలను ఎత్తుకెళ్లే కన్నింగ్‌ ఫెల్లో. నాలుగు నెలల క్రితం తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని ఎత్తుకెళ్లింది కూడా..

Tv9: టీవీ9 కథనాల ఫలితం..  అలిపిరిలో కిడ్నాప్‌కు గురైన బాలుడు క్షేమంగా ఇంటికొచ్చిన వైనం.!
Tv9 Effect
Venkata Narayana
|

Updated on: Jul 13, 2021 | 12:55 PM

Share

Tv9 effect – Kidnapped Boy Safe: శివ ప్రసాద్‌ అలియాస్‌ శివారెడ్డి. పిల్లలను ఎత్తుకెళ్లే కన్నింగ్‌ ఫెలో . నాలుగు నెలల క్రితం తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన బాలుడిని ఎత్తుకెళ్లింది కూడా ఇతడే. ఇంత కాలం ఎవరికి తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా బాబును కర్నాటకలో దాచేశాడు. ఎవరో.. ఎక్కడో టీవీ9 ప్రసారం చేసిన కథనాన్ని చూసి.. వాళ్లు రహస్యంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు వెళ్లిన పోలీసులకు.. ఆనాడు తప్పిపోయిన శివంసాహు ను కిడ్నాపర్‌ చెర నుంచి విడిపించారు. నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు.

శివారెడ్డి బాగోతాల లోతుల్లోకి వెళితే, నాలుగు నెలల క్రితం సాహు ఫ్యామిలీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చింది. తిరుపతి బాలాజీ లింక్ బస్ స్టాండ్ దగ్గర ఫ్యామిలీ నిద్రించింది. అప్పటికే పక్కా స్కెచ్‌ వేసిన శివప్రసాద్‌.. చడీచప్పుడు కాకుండా నిద్రలో ఉన్న సాహుని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. టీవీ9 కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున కథనాలను ప్రసారం చేసింది. ప్రత్యేక ప్రోమోలతో ప్రచారం చేసింది. నిందితుడి ఫోటోలతో స్టోరీలను నడిపించింది. అప్పటి నుంచి శివప్రసాద్‌ తప్పించుకునే తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు కూడా శివం సాహూ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ టీమ్‌లు గాలిస్తూనే ఉన్నాయి.

ఎట్టకేలకు.. టీవీ9 వీక్షకులు ఇచ్చిన సమాచారంతో సాహు అనే బాలుడిని కిడ్నాప్‌ చేసింది శివప్రసాద్‌ అని పోలీసులు తేల్చారు. అయితే, ఈ బాలుడి కిడ్నాప్‌పై శివప్రసాద్ కొత్త కథ చెప్పుకొస్తున్నాడు. కర్నాటక ముల్బాగల్‌ తాలూకా పుట్టనహళ్లికి చెందిన శివప్రసాద్‌కు ఓ కొడుకు ఉన్నాడు. అనారోగ్యంతో కొడుకు చనిపోయాడు. ఎవరిని చూసిన తన కొడుకులా ఊహించుకున్న శివప్రసాద్.. శివం సాహుని ఎత్తుకెళ్లి పెంచుకుంటున్నానంటూ పోలీసుల ముందు చెప్పాడు. ఈ వాదనలు విన్న పోలీసులే షాక్‌ తిన్నారు. ఏది ఏమైనా నాలుగు నెలల గాలింపు ఫలితంగా క్షేమంగా ప్రాణాలతో సాహూని తల్లిదండ్రులకు అప్పగించారు తిరుపతి అర్బన్‌ పోలీసులు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.

Read also: Atrocities: ప్రకాశం జిల్లాలో ఒకే రోజు రెండు దారుణాలు, సభ్యసమాజం తలదించుకునే ఉదంతాలు