AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Devotees: ఫేక్ లెటర్‌తో తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు.. ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు

తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యాలయం వద్ద ఆందోళన చేసిన భక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

TTD Devotees: ఫేక్ లెటర్‌తో తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు.. ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు
Balaraju Goud
|

Updated on: Jul 13, 2021 | 3:49 PM

Share

Police Registered a case against TTD Devotees: టీటీడీ అదనపు కార్యాలయం వద్ద ఆందోళన చేసిన భక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన భక్తులు తిరుమల దర్శనానికి వచ్చారు. అయితే, వారు ఫేక్ లెటర్ ద్వారా తమకు అదనపు దర్శనం, వసతి కల్పించాలంటూ ఈవో కార్యాలయ సిబ్బందితో వాగ్వావాదానికి దిగారు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఐదుగురు భక్తులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై సెక్షన్ 151 క్రింద కేసు నమోదు అయ్యింది. అదనపు ఈవో కార్యాలయ సిబ్బందితో వాగ్వావాదం చేసిన ఐదుగురు భక్తులను పోలీసులు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

కాగా, అడిషనల్ ఈవో కార్యాలయంలో ఫేక్ లెటర్లను, ప్రజాప్రతినిధులకు సంబంధించి ఒకటికన్నా ఎక్కువ లెటర్లను టీటీడీ తిరస్కరిస్తుంది. ఈ క్రమంలోనే భక్తులు టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి తోటి భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నారని వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కొంతమందిపై కేసులు నమోదు చేశామన్నారు.

మరోవైపు, తెలంగాణ ప్రజాప్రతినిధులు సిపారస్సు లేఖలను స్వీకరించిన కారణంగా టీటీడీ అదనపు ఈవో కార్యాలయం వద్ద భక్తులు ధర్నాకు దిగిన ఘటనపై టీటీడీ స్పందించింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలపై దర్శనాలను జారీ చేయడం దుష్ప్రచారమే అని టీటీడీ అధికారులు తెలిపారు. నిబంధనల మేరకు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపారు. ఒక్కో రోజు ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు జారీ చేసిన సమయంలోనే…. తిరస్కరణ జరుగుతుందని చెప్పారు. కొందరు ప్రజాప్రతినిధుల విజ్ఞాపన మేరకు వారి సిపారస్సు లేఖలపై ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను మంజూరు చేశామని టీటీడీ అధికారులు తెలియజేశారు.

Read Also…  నీకు భార్య ఉంటే.. ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేవు.. జ్యోతిష్కుడి సలహాతో దారుణం.. భర్త ఏం చేశాడంటే?