Mobile Phone: మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే మీ సేవలో ఫిర్యాదు చేయండి.. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్
Hyderabad CP Anjani Kumar: మొబైల్ ఫోన్ అపహరణకు గురైన వారు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా.. సమస్యకు పరిష్కారం లభించడం లేదు. దీంతోపాటు
Hyderabad CP Anjani Kumar: మొబైల్ ఫోన్ అపహరణకు గురైన వారు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా.. సమస్యకు పరిష్కారం లభించడం లేదు. దీంతోపాటు పలు పోలీసుస్టేషన్లల్లో ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్లు చోరీకి గురైన వారు మీ సేవ, హాక్ ఐ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అయితే.. ఆయా స్టేషన్ల పరిధిలో ఫోన్లు రికవరీ అయిన అనంతరం బాధితులకు సమాచారం అందిస్తామని వెల్లడించారు. కాగా.. నగరంలోని పాతబస్తీ పరిధిలో చోరీకి గురైన 66 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం వాటిని ఈ రోజులు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లు చోరీకి గురైన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొబైల్ ఫోన్లు చోరీకి గురైతే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. మీ సేవ, హాక్ ఐ ద్వారా బాధితులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ధ్రువీకరణపత్రాలు కొల్పోయిన మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. ఈ సందర్భంగా అంజనీ కుమార్ పలు విషయాలపై మాట్లాడారు. ఇతర దేశాల వీడియోలను హైదరాబాద్‌లో జరిగినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఇలాంటివి తరచూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. సోషల్ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read: