High Court: రెండు జిల్లాలు మినహా కోర్టుల్లో అన్‌లాక్ ప్రక్రియ షురూ.. ఈనెల 19 నుంచి ప్రారంభించాలని హైకోర్టు ఆదేశం

లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డ సంస్థలు ఒక్కొక్కటిగా తిరిగి గాడిలో పడుతున్నాయి. మెల్ల మెల్లగా ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమవుతోంది.

High Court: రెండు జిల్లాలు మినహా కోర్టుల్లో అన్‌లాక్ ప్రక్రియ షురూ.. ఈనెల 19 నుంచి ప్రారంభించాలని హైకోర్టు ఆదేశం
Telangana High Court
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 13, 2021 | 4:37 PM

High Court Starts Unlock Process: లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డ సంస్థలు ఒక్కొక్కటిగా తిరిగి గాడిలో పడుతున్నాయి. మెల్ల మెల్లగా ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌కే పరిమితమైన కార్యకలాపాలు తిరిగి పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కోర్టులు పూర్తిస్థాయిలో ప్రారంభించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఉమ్మడి ఆదిలాబాద్​, నిజామాబాద్​ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 19 నుంచి పాక్షిక విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా ఉద్ధృతి తగ్గడంతో న్యాయస్థానాల్లో అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అందరూ విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. హైకోర్టుతో పాటు మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 16 వరకు ఆన్​లైన్​ విచారణ కొనసాగుతుందని వెల్లడించింది. ఇప్పటి వరకు కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా రోజు విడిచి రోజు పరిమిత సంఖ్యలో సిబ్బంది మాత్రమే హాజరవుతున్నారు. ఇకపై పూర్తి స్థాయిలో సిబ్బంది హాజరు కావాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read Also… J&J Covid-19 Vaccine: జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వారి సింగిల్‌ డోస్ టీకాతో అరుదైన సమస్య.. హెచ్చరించిన ఎఫ్‌డీఏ!

తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం