AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malala : నోబెల్ అవార్డు గ్రహీత మలాలాపై పాకిస్తాన్ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ తప్పుడు ప్రచారం!

పాకిస్తాన్‌‌కు చెందిన నోబెల్‌ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌పై సొంత దేశంలో వ్యతిరేక వ్యక్తమవుతోంది.

Malala : నోబెల్ అవార్డు గ్రహీత మలాలాపై పాకిస్తాన్ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ తప్పుడు ప్రచారం!
Malala
Balaraju Goud
|

Updated on: Jul 13, 2021 | 3:11 PM

Share

Documentary to Expose Malala in Pakistan: పాకిస్తాన్‌‌కు చెందిన నోబెల్‌ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్‌ జాయ్‌పై సొంత దేశంలో వ్యతిరేక వ్యక్తమవుతోంది. బాలల హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రపంచం మొత్తం మెచ్చుకుంటూ అత్యుత్తమ నోబెల్ అవార్డును కట్టబెట్టింది ఐక్యరాజ్యసమితి. అయితే, ఆ దేశ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ ఆమెపై కొత్త అబాండాన్ని నెట్టుతూ.. ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఒక ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేసింది. మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తూ సహజీవనాన్ని సమర్థిస్తోందని ఆరోపించారు. మతం, పెళ్లి, పశ్చిమ దేశాల అజెండా అమలు విషయంలో ఆమె తీరును దీనిలో ప్రస్తావించారు. మలాలా సోమవారం 24వ పుట్టిన రోజు జరుపుకొన్నారు.

సోమవారం పాకిస్తాన్‌లోని గుల్‌బెర్గ్‌లోని కార్యాలయంలో ఆల్‌ పాకిస్థాన్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సంఘం అధ్యక్షుడు కసీఫ్‌ మీర్జా మాట్లాడుతూ ‘‘ ఐ యామ్‌ నాట్‌ మలాలా” అనే డాక్యుమెంటరీ చిత్రంలో.. ఆమెకు మతం, పెళ్లిపై ఉన్న వివాదాస్పద అభిప్రాయాలు, పశ్చిమ దేశాల అజెండా అమలు వంటి అంశాలను వెల్లడించాం. యువతలో ఆమె అసలు రూపాన్ని బహిర్గతం చేయడమే మా లక్ష్యం. మహిళల హక్కుల కోసం పోరాడుతుందనుకొని యువత ఆమె పట్ల ఆకర్షితులు కాకుండా చేయడమే మా ఉద్దేశం. మా దేశంలోని రెండు లక్షల పాఠశాలల్లోని రెండు కోట్ల మంది విద్యార్థులకు దీనిని చూపిస్తాం’’ అని పేర్కొన్నారు. మలాలా పెళ్లిని వ్యతిరేకిస్తూ సహజీవనాన్ని సమర్థిస్తోందని ప్రైవేట్‌ స్కూల్స్‌ ఫెడరేషన్‌ ఆరోపించింది.

దేశంలోని వివాహ వ్యవస్థపై ఆమె దాడి చేస్తోందని పేర్కొన్నారు. మలాలా రాసిన ‘ఐ యామ్‌ మలాలా’ పుస్తకంలోని పలు అంశాలను ఆయన తప్పుపట్టారు. పాక్‌ పాఠశాలల్లో మతపరమైన విద్యను బోధించడం, అలీ జిన్నా గురించి చెప్పడంపై ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. ఈ పుస్తకాన్ని పశ్చిమ దేశాల అజెండా అమలు కోసం రాసినట్లు ఉందన్నారు.

Read Also… SBI Warning : ఎస్బీఐ హెచ్చరిక..! ఈ లింక్‌లపై అప్రమత్తంగా ఉండండి.. లేదంటే అకౌంట్ ఖాళీ అవుతుంది..