Sundar Pichai: నాలోనూ భారతీయత ఉంది.. సాంకేతిక అలవాట్లను షేర్ చేసిన గూగుల్ CEO సుందర్​ పిచాయ్

గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​.. తన టెక్​ అలవాట్లను తెలిపారు. పాస్​వర్డ్​లను ఎన్నిసార్లు మార్చుకోవాలి? పిల్లల 'స్క్రీన్​ టైమ్​'పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  తనకున్న...

Sundar Pichai: నాలోనూ భారతీయత ఉంది.. సాంకేతిక అలవాట్లను షేర్ చేసిన గూగుల్ CEO సుందర్​ పిచాయ్
Sundar Pichai
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 13, 2021 | 2:01 PM

గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​.. తన టెక్​ అలవాట్లను తెలిపారు. పాస్​వర్డ్​లను ఎన్నిసార్లు మార్చుకోవాలి? పిల్లల ‘స్క్రీన్​ టైమ్​’పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  తనకున్న టెక్​ అలవాట్లను వెల్లడించారు. అంతే కాదు తన వ్యక్తిగత సాంకేతిక అలవాట్ల గురించి కూడా పిచ్చాయ్ మాట్లాడుతూ.. పాస్‌వర్డ్‌ల విషయానికి వస్తే ‘రెండు-కారకాల ప్రామాణీకరణను స్వీకరించాలని సూచించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి తన ఫోన్‌ను ఎప్పటికప్పుడు మారుస్తుంటానని ఒప్పుకున్నారు.  అంతే కాదు తనలో భారతీయత పూర్తిగా నిండి ఉందని, తాను కూడా అందులో ఓ భాగమేనని గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ చెప్పుకొచ్చారు.

కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయంలో మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇంటర్నెట్‌కు ముప్పు సహా పలు అంశాలపై ఇంటర్వ్యూలో సుందర్ పిచ్చాయ్ మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివి ఈ శతాబ్దాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయని వ్యాఖ్యానించారు.

తన మూలల గురించి అడిగిన ప్రశ్నకు పిచ్చాయ్ తనలో భారతీయత ఉందని సమాధానం ఇచ్చారు. తాను అమెరికా పౌరుడినే కానీ, తనలో భారతీయత నిండి ఉందని అన్నారు. కాబట్టి నేను కూడా అందులో ఓ భాగమే అని చెప్పుకున్నారు. చైనా మోడల్ ఇంటర్నెట్ మనుగడలో ఉందా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇంటర్నెట్‌ ముప్పును ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, చైనా పేరునే ఎత్తకుండానే.. పరోక్షంగా ప్రస్తావించారు. అక్కడ తమ ప్రధాన ఉత్పత్తులు గానీ, సేవలు గానీ అందుబాటులో లేవన్నారు. పన్నుల చెల్లింపు వివాదంపై స్పందిస్తూ..ప్రపంచంలోనే అతిపెద్ద పన్ను చెల్లింపుదారులలో గూగుల్ ఒకటి అని పేర్కొన్నారు. గత దశాబ్దంలో సగటున చూస్తే మేం 20 శాతానికి పైగా పన్నులు చెల్లించామంటూ అభిప్రాయ పడ్డారు. అమెరికాలోని తమ వాటాలో ఎక్కువ భాగాన్ని పన్నుల రూపంలో చెల్లిస్తామని అన్నారు. గూగుల్ సంస్థను అమెరికాలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఆ తర్వాత ఉత్పత్తులు అభివృద్ధి చెందినట్లుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి: Yashpal Sharma: టీమిండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ కన్నుమూత.. భావోద్వేగానికి గురైన భారత క్రికెటర్లు

Firing in Delhi court: ఢిల్లీ కోర్టులో దారుణం..కేసు విచారణకు హాజరైన వ్యక్తి కాల్చివేత..నిందితుని పరారీ