Firing in Delhi court: ఢిల్లీ కోర్టులో దారుణం..కేసు విచారణకు హాజరైన వ్యక్తి కాల్చివేత..నిందితుని పరారీ
చివరకు కోర్టులు కూడా క్రిమినల్స్ ని భయపెట్టలేకపోతున్నాయి. సాక్షాత్తూ కోర్టులోనే దారుణ నేరాలు జరుగుతున్నాయంటే ఇక న్యాయవ్యవస్థ ఎటు వైపు వెళ్తోందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని ద్వారకా కోర్టులో సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దారుణ హత్య జరిగింది.
చివరకు కోర్టులు కూడా క్రిమినల్స్ ని భయపెట్టలేకపోతున్నాయి. సాక్షాత్తూ కోర్టులోనే దారుణ నేరాలు జరుగుతున్నాయంటే ఇక న్యాయవ్యవస్థ ఎటు వైపు వెళ్తోందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని ద్వారకా కోర్టులో సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. . కేసు విచారణకు హాజరైన ఓ వ్యక్తిని కోర్టులోనే ఒకరు కాల్చి చంపి పరారయ్యాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లాయర్లు, ఇంకా పలువురు సాక్షులు అక్కడ ఉండగానే ఈ ఘటన జరిగింది. బుల్లెట్ గాయాలకు గురైన మృతుడిని ఉపకార్ గా గుర్తించారు. అరుణ్ శర్మ అనే అడ్వొకేట్ కి ఉద్దేశించిన 444 నెంబర్ ఛాంబర్ లో ఈ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసు విచారణకు హాజరయ్యేందుకు ఉపకార్ కోర్టుకు వచ్చినట్టు తెలిసింది. కాగా కాల్పులు జరిపిన వ్యక్తిని ఓ లాయర్ గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి : ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.