AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆయనకు బెయిల్ ఇలా వచ్చిందో, లేదో అలా భారత విమానం అక్కడ వాలింది ! కానీ.. ఏం లాభం ?

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కేసులో కొత్త ట్విస్ట్ ! ఆయనకు డొమినికా కోర్టు బెయిల్ మంజూరు మంజూరు చేసింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే .. అక్కడి డగ్లస్ చార్లెస్ విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం చేరుకుంది .ఆయనకు బెయిల్ లభిస్తుందని, ఆ వెంటనే అట్నుంచి

ఆయనకు బెయిల్ ఇలా వచ్చిందో, లేదో  అలా భారత విమానం అక్కడ వాలింది ! కానీ.. ఏం లాభం ?
Diamond Merchant Mehul Choksi Gets Bail
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jul 13, 2021 | 2:01 PM

Share

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కేసులో కొత్త ట్విస్ట్ ! ఆయనకు డొమినికా కోర్టు బెయిల్ మంజూరు మంజూరు చేసింది. ఈ కేసు విచారణ జరుగుతుండగానే .. అక్కడి డగ్లస్ చార్లెస్ విమానాశ్రయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం చేరుకుంది .ఆయనకు బెయిల్ లభిస్తుందని, ఆ వెంటనే అట్నుంచి ఇటు తక్షణమే ఈ విమానంలో ఇండియాకు తీసుకువద్దామని భారత అధికారులు భావించారా ? పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసులో చోక్సీని ఇండియాకు అప్పగించాలని భారత అధికారులు కోరని క్షణమంటూ లేదు. నిజానికి గత మే 28 నే సిబిఐ, ఈడీ అధికారులతో కూడిన విమానం ఖతార్ నుంచి డొమినికా వెళ్ళింది. ఆయన చీటింగ్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అక్కడి కోర్టుకు సమర్పించాలని యోచించింది. అయితే కేసు విచారణ వాయిదా పడడంతో జూన్ 3 న ఈ బృందం తిరిగి వట్టి చేతులతో ఇండియాకు వచ్చింది,

కాగా లోగడ బెయిల్ కోసం చోక్సీ దాఖలు చేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. అయితే మళ్ళీ సవరించిన పిటిషన్ ని దాఖలు చేశాడాయన. తన ఆరోగ్యం బాగులేదని ఇందులో పేర్కొన్నాడు. దీంతో కోర్టు బెయిల్ ఇస్తూ ఆంటిగ్వా కు వెళ్లి …గాడెన్ ఓస్ బోర్న్ అనే న్యూరాలజిస్టును సంప్రదించాలని ఆయనకు సూచించింది. ఒకవేళ డాక్టర్ ను మార్చవలసి వస్తే ఆ విషయాన్ని కూడా తెలియజేయాలని ‘ఆప్యాయంగా’ మరో సూచన కూడా చేసింది. బెయిల్ పై తన విడుదలకు చోక్సీ 10 వేల డాలర్లను కోర్టు రిజిస్ట్రార్ వద్ద డిపాజిట్ చేశాడు. సో.. మళ్ళీ భారత విమానం ఉసూరుమంటూ ఇండియాకు తిరిగి రాక తప్పదు..

మరిన్ని ఇక్కడ చూడండి : ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.

News Watch : రెంటికీ చెడ్డ పాడి… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…( వీడియో )

 మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021

 బూతులు తిడుతున్నారు..సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు అని పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు..:Mohan Babu