నీకు భార్య ఉంటే.. ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేవు.. జ్యోతిష్కుడి సలహాతో దారుణం.. భర్త ఏం చేశాడంటే?

Palm Reader Advises Man: జాతకాలు, జ్యోతిష్యం లాంటివి చాలా మంది అమితంగా విశ్వసిస్తారు. గ్రహాలు.. మూహుర్తాలు అంటూ.. బాబాలు, జ్యోతిష్కులు

నీకు భార్య ఉంటే.. ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేవు.. జ్యోతిష్కుడి సలహాతో దారుణం.. భర్త ఏం చేశాడంటే?
Palm Reader Advises Man
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 13, 2021 | 3:44 PM

Palm Reader Advises Man: జాతకాలు, జ్యోతిష్యం లాంటివి చాలా మంది అమితంగా విశ్వసిస్తారు. గ్రహాలు.. మూహుర్తాలు అంటూ.. బాబాలు, జ్యోతిష్కులు చెప్పిన విషయాలను తూచాతప్పకుండా పాటిస్తుంటారు. ఈ క్రమంలో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు, మంచిగా సంపాదించి ఉన్నతంగా స్థిరపడేందుకు.. ఏం చేయడానికి కూడా వెనుకాడరు. ఈ పనుల్లో కొన్ని మంచివి ఉంటే.. మరికొన్ని దరిద్రంగా ఉంటాయి. ఈ క్రమంలో కొంతమంది బాబాలు చెప్పిన మాటలు విని పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి భార్యనే వదిలిపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఓ ప్రబుద్ధుడు జ్యోతిష్కుడు చెప్పిన మాటలను నమ్మి.. కట్టుకున్న భార్యకే విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. భార్యను వదిలేస్తే ఉన్నత పదవులు ఎమ్మెల్యే, మంత్రి వంటివి వస్తాయని.. ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో సోమవారం వెలుగు చూసింది.

పూణే పట్టనానికి చెందిన రఘునాథ్‌ ఏముల్‌.. తాను ఎమ్మెల్యే లేదా మంత్రి కావాలంటే ఏం చేయాలని హస్త రేఖలు చూసి జాతకం చెప్పే జ్యోతిష్కుడిని అడిగాడు. దీనికి అతను సమాధానమిస్తూ… ఇంట్లో తన భార్య ఉండగా నువ్వు ఎప్పటికీ నీ కలను సాకారం చేసుకోలేవని.. ఆమె మంచిది కాదంటూ పలు నిందలు వేశాడు. తనకు విడాకులు ఇస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సలహా అడిగిన వ్యక్తికి సమాధానమిచ్చాడు. ఇది నమ్మిన రఘునాథ్‌ అనే వ్యక్తి.. అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి భార్యను వేధింపులకు గురిచేయడం మొదలిపెట్టాడు.

భర్త, అత్తామామ వేధింపులతో విసిగిపోయిన భార్య.. తనను వేధింపులకు గురిచేస్తున్నారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఆ మహిళా ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి విచారించారు. దీంతో జరిగిన విషయం మొత్తం వెలుగులోకి వచ్చింది. జ్యోతిష్కుడిని నమ్మి రఘునాథ్ ఈ విధంగా ప్రవర్తించాడని పోలీసులు వెల్లడించారు. జ్యోతిష్కుడిని కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని.. పూణే పోలీసు కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు.

Also Read:

Fish Biscuits: గుడ్‌న్యూస్‌.. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఫిష్‌ బిస్కెట్లు ..!

Crime News : కొడుకు జీతం కోసం ఏటీఎంకు వెళ్లిన తండ్రిని ట్రాప్ చేశారు..! సాయం పేరుతో 40 వేలు దోచేశారు..