Fish Biscuits: గుడ్‌న్యూస్.. కరోనా రాకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఫిష్ బిస్కెట్లు ..!
Fish Biscuits: చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు. చేపల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అందుకే చేపలు..
Fish Biscuits: చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు. చేపల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అందుకే చేపలు ఎక్కువగా తినాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. చేపలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఓమెగా అధికంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫైబర్ కంటెంట్ అధిక స్థాయిలో ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పంజాబ్‌లోని లూధియానా ఫిషరీస్ కళాశాల ఫిష్ బిస్కెట్లను అభివృద్ధి చేసింది. ఈ బిస్కెట్లో కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఈ బిస్కెట్లను తయారు చేస్తున్నట్లు ఆ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసలు చెబుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి ప్రొటీన్స్ కలిగిన బిస్కెట్లు తినడం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. అయితే ఇందులో మంచి ప్రొటీన్స్, అధికంగా ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఈ అధిక ప్రోటీన్స్ కలిగిన బిస్కెట్లు అన్ని నాణ్యత విలువలు కలిగి ఉంటాయంటున్నారు. అయితే చేపలతో తయారు చేసే ఈ బిస్కెట్లు చేపల వాసన అస్సలు ఉండవు. తద్వారా పిల్లలు ఈ రుచికమైన బిస్కెట్లను తినేందుకు వెనుకడుగు వేయరు. ఇష్టంగా తింటారంటున్నారు.
కాగా, ప్రస్తుతం కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కట్టడికి పరిశోధకులు ఎన్నో రకాల పరిశోధనలు చేపడుతున్నారు. కరోనా కట్టడికి రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం టీకా రూపంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. మాత్రలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇక ముఖ్యంగా మనిషి కరోనాను ఎదుర్కొవాలంటే ముఖ్యంగా ఉండాల్సింది రోగనిరోధక శక్తి అవసరం. అందుకు మంచి ఇమ్యూనిటీని అందించే ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీ ఫిష్‌తో బిస్కెట్లను తయారు చేశారు. ఈ బిస్కెట్ల వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరగడంతో కరోనా నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.